ఎన్టీఆర్: కంచికచర్ల పట్టణంలోని సెంట్రల్ బ్యాంక్ రోడ్డులో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కంచికచర్ల మార్కెట్ యార్డు ఛైర్మన్, మండల టీడీపీ అధ్యక్షులు కోగంటి బాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అర్చకులు, కాకాని సుమన్, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
Locations: Krishna
-
బుడమేరుపై వదంతులు నమ్మొద్దు : కలెక్టర్
ఎన్టీఆర్: బుడమేరు వరదపై కలెక్టర్ లక్ష్మీశా క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా బుడమేరు పొంగిపొర్లుతుందని కొంతమంది ఫేక్ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వరంగల్, ఖమ్మంలో వర్షాలు పడితే ఆనీరు మునేరు వైపు వెళ్తుందని.. తిరువూరు నియోజకవర్గంలో పడిన వర్షం బుడమేరు వైపునకు వస్తుందన్నారు. బుడమేరులో 3వేల క్యూసెక్కులు వరద ప్రవాహం ఉందన్నారు. వదంతులు నమ్మొద్దన్నారు.
-
ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
ఎన్టీఆర్: ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం పెరగడంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 4.05 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కృష్ణా, గోదావరి, తుంగభద్ర నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు.
-
కోస్తాంధ్రకు భారీ వర్ష సూచనపై అనగాని సమీక్ష
కోస్తాంధ్రకు భారీ వర్ష సూచనపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అధికారులంతా ఎక్కడికక్కడ సహాయ చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఉత్తరాంధ్ర, ఏలూరు, కృష్ణా జిల్లాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
-
సుగాలి ప్రీతి కేసును పవన్ గాలికొదిలేశారు : పార్వతి
ఎన్టీఆర్: అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి ప్రీతి కేసును డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ గాలికొదిలేశారని ప్రీతి తల్లి పార్వతీ మండిపడ్డారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ కేసుపై చర్చించి, వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. తమకు నమ్మకద్రోహం జరిగిందని.. త్వరలో గవర్నర్‌ని కలిసి వినతిపత్రం అందజేస్తామన్నారు. అవసరమైతే మంగళగిరి జనసేన ఆఫీస్ ఎదుట నిరాహార దీక్షకు కూర్చుంటానన్నారు.
-
కంచికచర్ల నుంచి ఆ గ్రామాలకు రాకపోకలు బంద్!
ఎన్టీఆర్: కంచికచర్ల మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి కురిసిన 10 సెంటీమీటర్ల వర్షానికి ఏనుగుగడ్డ వాగు, తోళ్ళ వాగు, నక్కల వాగు, లక్ష్మయ్య వాగు, రాళ్ళవాగు తదితర వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కంచికచర్ల-చెవిటికల్లు వెళ్లే ఆర్&బి రోడ్లు, లక్ష్మయ్య వాగుకు వరదరావడంతో చెబిటికల్లు, కునికినపాడు, మున్నలూరు గ్రామాలకు మండల కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి.
-
హెచ్చరిక.. ‘దాటేందుకు ప్రయత్నించొద్దు’
ఎన్టీఆర్: రెడ్డిగూడెం మండలంలో గత రెండు రోజులుగా వర్షం కురుస్తుంది. దీంతో రోడ్డుపై ఉధృత ప్రవాహంతో ఓబులాపురం-రంగాపురం మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ వరద ఉధృతి మరో రెండు రోజులు కొనసాగేలా కనిపిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉధృతంగా వస్తున్న వరదను దాటేందుకు వాహనదారులు ప్రయత్నించకుండా ట్రాక్టర్లు అడ్డు పెట్టినట్లు తెలిపారు.
-
అక్రమ రవాణాను అడ్డుకోరా?
ఎన్టీఆర్: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అక్రమ రవాణా చేస్తున్న యూరియా, పోటాషియం బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో యూరియా కొరత రావడంతో వ్యాపారులు అక్రమంగా ఎక్కువ రేటుకు తెలంగాణకు అమ్మకాలు చేస్తున్నారు. యూరియాను రూ.400 నుంచి రూ.450కి అమ్ముతుంటే అగ్రికల్చర్ అధికారులు అడ్డుకోకుండా చోద్యం చూస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
-
ముంపు బాధితుల గోడు పట్టించుకోరా!
ఏలూరు: ముసునూరు మండలం రమణక్కపేటలో గత రాత్రి నుంచి కురిస్తున్న వర్షాలకు కుమ్మరపేటలోని ఇళ్లు ముంపునకు గురై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరద నీరు వెళ్లేటట్లు చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. గతంలో కూడా ఈ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులు, చిన్నపిల్లలతో తాము ఇబ్బందులు పడుతున్నామని, ఇకనైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
-
విజయవాడలో డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరి అరెస్ట్
ఎన్టీఆర్: విజయవాడలో డ్రగ్స్ కలకలం రేపాయి. 18 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను ఈగల్ బృందం స్వాధీనం చేసుకుంది. డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకుంది. బెంగళూరు నుంచి విశాఖ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో డ్రగ్స్ తరలిస్తుండగా పట్టుకున్నారు. నిందితులు శ్రీవత్సవ(23), హవిలా డిలైట్(24)గా గుర్తించారు. నిందితులను మాచవరం పోలీసులకు అప్పగించారు.