Locations: Krishna

  • కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్

    ఎన్టీఆర్: ఎడతెరిపి లేకుండా వ‌ర్షాలు కురుస్తున్నందున క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమ‌త్తంగా ఉండాలని కలెక్టర్ ల‌క్ష్మీశ సూచించారు. వర్షాలకు సంబంధించి 9154970454 నంబ‌రుతో కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. వ‌ర‌ద‌లకు సంబంధించి ఎప్పటిక‌ప్పుడు ప‌రిస్థితిని ప‌రీవాహ‌క గ్రామాల ప్రజ‌ల‌కు తెలియ‌జేయాలని అధికారులకు సూచించారు.

  • విజయవాడలో జోరు వాన.. మోకాళ్లోతు నీరు

    ఎన్టీఆర్: వర్షాల కారణంగా విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాతబస్తీ, ఏపీఐఐసీ కాలనీ, బెంజ్‌సర్కిల్, పీఅండ్‌టీ కాలనీ ప్రాంతాలను వర్షపు నీరు ముంచెత్తింది. రోడ్లన్నీ కాలువలను తలపించాయి. ఇళ్లలో నుంచి బయటకు రావడానికి ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. బెంజ్‌సర్కిల్ వద్ద మెకాళ్లోతు వరకు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

  • మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు

    ఏలూరు: నూజివీడు పట్టణంలోని జంక్షన్ రోడ్‌లో RR పేట వద్ద కాలువలు పూడిపోవడం వల్ల వర్షపు నీరు రోడ్డుపైకి వచ్చి ప్రజలకు అసౌకర్యం కలిగింది. సమస్యను గమనించిన మంత్రి పార్థసారథి సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. కాలువల శుభ్రపరిచే పనులు వేగంగా చేపట్టేలా చర్యలు ప్రారంభించారు. తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటున్న మంత్రికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

  • కట్టలేరు వాగుకు వరద.. 20 గ్రామాలకు రాకపోకలు బంద్..!

    AP : NTR జిల్లాలో కట్టలేరు వాగుకు మరోసారి వరద ప్రవాహం పోటెత్తింది. గంపలగూడెం మండలం వినగడప – తోటమూల గ్రామాల మధ్య ఉన్న కట్టలేరు వాగుకు పోటెత్తిన వరదతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 20 గ్రామాల ప్రజలపై దీని ప్రభావం పడింది. అత్యవసర సమయంలో నూజివీడు మీదుగా విజయవాడ వెళ్లాలి అంటే… అదనంగా 30 కిలో మీటర్లు తిరిగి తిరువూరు మీదుగా వెళాల్సిన పరిస్థితి ఏర్పడింది.

  • ‘ప్రజా సమస్యల పరిష్కారమే నా కర్తవ్యం’

    ఏలూరు: నూజివీడు పట్టణం 15వ వార్డులోని ఎన్టీఆర్ కాలనీలో ఇటీవల కురిసిన భారీవర్షాల కారణంగా ఇళ్లలో నీరుచేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం మంత్రి కొలుసు పార్థసారథి దృష్టికి వచ్చింది. దీంతో ఆయన ఆదేశాల మేరకు వారి కార్యాలయ సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టారు. వర్షపు నీరు బయటకు వెళ్లేలా జేసీబీ సహాయంతో కాలువల్లోని చెత్త, మురుగు తొలగింపు పనులు చేపట్టారు.

     

  • ఎడతెరిపి లేని వర్షాలు.. ఆందోళనలో రైతులు!

    ఎన్టీఆర్: మైలవరం మండలంలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. వాగుల వ్యవస్థ సరిగా లేకపోవడంతో వరద నీరు పత్తి పంట పొలాల్లో నిలిచిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద మరో రెండు రోజులు కొనసాగితే పత్తి మొక్కలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని రైతులు వాపోయారు.

  • ఉధృతంగా కృష్ణమ్మ.. మధ్యాహ్నంలోపు మొదటి ప్రమాద హెచ్చరిక!

    ఎన్టీఆర్: ఎగువ నుంచి వస్తున్న వరదతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రవాహం పెరుగుతోంది. మధ్యాహ్నంలోపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశముందని APSDMA ఎండీ ప్రఖర్‌జైన్ తెలిపారు. ప్రస్తుత బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 3.62 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లంకగ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు.

  • పెరుగుతున్న వరద.. పొంచి ఉన్న ప్రమాదం!

    ఎన్టీఆర్: మైలవరంలో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు కొండ వాగు, కోతుల వాగు ఉధృతంగా ప్రవహిస్తూ బుడమేరు వాగులోకి కలుస్తున్నాయి. గతేడాది కురిసిన వర్షాలకు బుడమేరు వాగుకు పలుచోట్ల గండ్లు పడ్డాయి. క్రమంగా పెరుగుతున్న వరదకు కాలువ పక్కనున్న వందల ఎకరాల వరిపంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

     

     

  • అక్రమంగా తరలిస్తున్న ఎరువుల పట్టివేత

    ఎన్టీఆర్: గంపలగూడెం మండలం ఊట్కూరు గ్రామం వద్ద గంపలగూడెం ఎస్సై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో నందిగామ నుంచి కల్లూరుకు అక్రమంగా తరలిస్తున్న 40 యూరియా బస్తాలు, 40 పొటాషియం సల్ఫేట్ బస్తాలను గంపలగూడెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • ప్రశాంతంగా బుడమేరు కాలువ

    ఎన్టీఆర్: కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ వద్ద బుడమేరు కాలువ ప్రశాంతంగా ప్రవహిస్తుంది. పైనుంచి వస్తున్న వర్షపు నీరుతో పాటు వాగుల్లోంచి బుడమేరులోకి సుమారు 1,600 క్యూసెక్కులు కృష్ణా నదిలో కలుస్తుంది. సుమారు 4,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 15,000 క్యూసెక్కులు వచ్చేంత వరకు బుడమేరు ప్రశాంతంగా ఉంటుందని అధికారులు తెలిపారు.