ఎన్టీఆర్: తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తిరువూరు నియోజకవర్గంలో వినగడప-తోటమూల మధ్య ఉన్న కట్టలేరు వాగు ఉధృతికి 20 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. మైలవరం నియోజకవర్గంలో రోడ్డుపై ఉధృత ప్రవాహంతో ఓబులాపురం-రంగాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు.
Locations: Krishna
-
తిరువూరులో నమోదైన వర్షపాతం
ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరువూరు నియోజకవర్గంలో గడిచిన 24గంటల్లో అత్యధికంగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. తిరువూరు 9.84 సెం.మీ, గంపలగూడెం 8.76 సెం.మీ, విస్సన్నపేట 8.44 సెం.మీ, ఏ.కొండూరు 8.84 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
-
ఉప్పొంగిన వైరా, కట్టలేరు వాగులు.. రాకపోకలకు అంతరాయం
ఎన్టీఆర్: నందిగామ నియోజకవర్గంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నందిగామ మండలం అడివిరావులపాడు వద్ద నల్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. చందర్లపాడు మండలం నుంచి రామన్నపేట వైపు ఉన్న గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దాములూరు కూడలి వద్ద వైరా, కట్టలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తెలంగాణ-ఏపీ సరిహద్దు ప్రాంతంలో రాకపోకలను అధికారులు నిలిపివేశారు.
-
నూజివీడు డివిజన్‌లో 351.8 మి.మీ. వర్షపాతం
ఏలూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత 24 గంటల్లో నూజివీడు డివిజన్లో మొత్తం 351.8 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు సబ్ కలెక్టర్ వినూత్న తెలిపారు. మండలాల వారీగా వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. చింతలపూడి 48.2 మి.మీ., చాట్రాయి 32.4 మి.మీ., ఆగిరిపల్లి 36.8 మి.మీ., లింగపాలెం 73.4 మి.మీ., ముసునూరు 135.4 మి.మీ., నూజివీడు 25.6 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. డివిజన్ మొత్తంలో సగటు వర్షపాతం 58.6 మి.మీటర్లుగా నమోదైంది.
-
వాగు ఉధృతి.. ఆ గ్రామాలకు రాకపోకలు బంద్!
ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం మండలం దొనబండ వద్ద ఏనుగుగడ్డ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో చిలుకూరు, దాములూరు, కొత్తపేట, ఆత్కూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏనుగు గడ్డ వాగుకు పై ప్రాంతాల నుండి నీరు అధికంగా వస్తుండటంతో చిలుకూరు వద్ద రాకపోకలు నిలిచిపోయాయి.
-
తిరువూరులో 13 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
ఎన్టీఆర్: తిరువూరు పట్టణంలో పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు నిర్వహించారు. రాజుపేట బస్టాండ్ వెనుక బజార్లో 10 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి రూ.30వేలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. పాత తిరువూరులో ముగ్గురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.2,900 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
-
నీట మునిగిన కంచికచర్ల బస్టాండ్
ఎన్టీఆర్: భారీ వర్షాల కారణంగా కంచికచర్లలోని ఆర్టీసీ బస్టాండ్ నీట మునిగింది. బస్టాండ్ ఆవరణలో భారీగా నీరు చేరడంతో బస్సుల రాకపోకలు బంద్ అయ్యాయి. బస్టాండ్ బయట నుంచే బస్సులు తిరిగి వెళ్తున్నాయి. చందర్లపాడు మండలంలోని తొర్లపాడు-ముప్పాళ్ళ గ్రామాల మధ్య వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వీరులపాడు మండలం చెన్నారావుపాలెం వద్ద ఏనుగు గడ్డవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రంగాపురానికి రాకపోకలు నిలిచిపోయాయి.
-
నేడు విద్యాసంస్థలు బంద్!
ఎన్టీఆర్: నందిగామ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీచేశారు. నందిగామ, కంచికచర్ల, వీరులపాడు, చందర్లపాడు మండలాల్లో విస్తీరంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసరంగా విద్యాసంస్థలకు సెలవు మంజూరు చేశారు.
-
భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం
ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాలకు విజయవాడలో రోడ్లన్ని జలమయం అయ్యాయి. కట్టెలేరు వంతెనపై వస్తున్న వరద నీటిని అధికారులు మళ్లిస్తున్నారు. భారీ వర్షాలతో నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం, గన్నవరం, పామర్రు, పెనమలూరు, మచిలీపట్నం, అవనిగడ్డ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
-
రహదారులు ఇలా.. పట్టించుకోకపోతే ఎలా?
ఎన్టీఆర్: కంచికచర్ల గొట్టుముక్కల రోడ్డుకు వెళ్ళే మార్గంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. దీంతో వర్షపు నీరు రోడ్డు పక్కనున్న షాపులోకి చేరింది. జుజ్జూరు రోడ్డు పాత సినిమా హాల్ దగ్గర నుంచి భావన సెంటర్ వరకు రహదారిపై నీరు నిలుస్తున్న పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కనీసం సంవత్సరానికి ఒకసారైనా డ్రైనేజీలు తీయకపోతే ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.