Locations: Krishna

  • ఎడతెరిపి లేని వర్షం.. అన్నదాతల్లో ఆనందం!

    ఏలూరు: నూజివీడు పరిసర ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుండి గురువారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో వర్షపు నీరు రోడ్లపై నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరి పంటకు ఈ వర్షం ఎంతో ఉపయోగపడుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  • నందిగామ డివిజన్‌లో 580.0 మి.మీ వర్షపాతం

    ఎన్టీఆర్: నందిగామ డివిజన్లో బుధవారం ఉదయం 8 గంటల నుండి గురువారం ఉదయం 8 గంటల వరకు 580.0 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. వత్సవాయిలో 67.8 మి.మీ., జగ్గయ్యపేటలో 62.4 మి.మీ., పెనుగంచిప్రోలు 67.4 మి.మీ., నందిగామలో 64.4 మి.మీ., వీరులపాడులో96.2 మి.మీ., కంచికచర్లలో 98.8 మి.మీ., చందర్లపాడులో123.0 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. డివిజన్లో సగటుగా 82.8 మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

  • ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద.. 69 గేట్లు ఎత్తి నీటి విడుదల

    AP: భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. బ్యారేజీలోకి ప్రస్తుతం 3,03,000క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో 69గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తి 2,97,000క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో మరో రెండు మూడు గంటల్లో ప్రకాశం బ్యారేజీకి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముంది. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

  • విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధం: మంత్రి

    ఏలూరు: వాతావరణ శాఖ భారీ వర్షాలు హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పార్థసారథి తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రాణ రక్షణ, ఆస్తి రక్షణ కోసం వరద విపత్తును ఎదుర్కోవటానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు.

  • కట్టలేరు వాగుకు పోటెత్తిన వరద.. రాకపోకలు బంద్!

    ఎన్టీఆర్: గంపలగూడెం మండలం వినగడప-తోటమూల గ్రామాల మధ్య ఉన్న కట్టలేరు వాగుకు వదర నీరు పోటెత్తింది. మీటర్ల మేర తాత్కాలిక రోడ్డు కోతకు గురికావడంతో వాగు వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు, ప్రజలు, వాహనదారులు ప్రమాదం అంచున ప్రయాణిస్తున్నారు. దీంతో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు 20 గ్రామాలకు రాకపోకలు నిలిపివేశారు. వరద తగ్గుముఖం పట్టే వరకు బందోబస్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

  • విజయవాడ సహా ఉమ్మడి కృష్ణాలో ఎడతెరిపిలేని వర్షాలు

    AP: అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ నగరంలో రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. కట్టెలేరు వంతెనపై వస్తున్న వరదనీటిని అధికారులు మళ్లిస్తున్నారు. నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం, గన్నవరం, పామర్రు, పెనమలూరు, మచిలీపట్నం, అవనిగడ్డ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

  • కట్టలేరు వాగుకు భారీగా వరద.. ప్రమాదం అంచున ప్రయాణం..!

    ఎన్టీఆర్: గంపలగూడెం మండలం వినగడప-తోటమూల గ్రామాల మధ్య కట్టలేరు వాగుకు భారీ వరద పోటెత్తింది. రెండు వారాల క్రితం వరదలతో గండిపడిన తాత్కాలిక రహదారి మీటర్ల మేర కోతకు గురైంది. మరమ్మత్తుల అనంతరం రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. అల్పపీడనంతో కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ నుంచి వచ్చే వరదలతో వాగు మళ్లీ ఉప్పొంగింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, ప్రజలు, వాహనదారులు ప్రమాదం అంచున ప్రయాణిస్తున్నారు.

  • ‘రైతులందరూ సుఖ, సంపదలతో బాగుండాలి’

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలంలోని పరిటాల, నక్కలంపేట, కంచికచర్ల, కీసర గ్రామాల్లో ఏర్పాటైన గణపతి మండపాలను మార్కెట్ కమిటీ ఛైర్మన్ కోగంటి బాబు స్థానిక కూటమి నేతలతో సందర్శించి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులందరూ సుఖ, సంపదలతో బాగుండాలని ఆకాంక్షించారు.

  • గణనాథుని పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

    ఎన్టీఆర్: కంచికచర్ల 8వ వార్డు అపార్ట్‌మెంట్ ప్రక్క దేవిరెడ్డి బజార్‌లో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణపతి మండపంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, వైసీపీ అధ్యక్షుడు వేమా సురేష్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి పూజ విఘ్నాలను తొలగించి విజయం అందిస్తుందని, పండుగలు సంస్కృతి భాగమని జగన్మోహనరావు తెలిపారు. అనంతరం అన్నదానం నిర్వహించారు.

  • గొట్టుముక్కలలో ఘనంగా గణపతి పూజలు

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో సొసైటీ వద్ద ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు 11 అడుగుల వినాయకుని మండపాన్ని ఏర్పాటు చేశారు. వినాయక చతుర్థి సందర్భంగా నవరాత్రి ఉత్సవాలలో గణపతి పూజలు వైభవంగా జరిగాయి. గ్రామంలో భక్తులు విఘ్నేశ్వరుని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో బండి వెంకట్రావు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.