Locations: Krishna

  • విజయవాడలో భారీ వర్షాలు.. రెస్పాన్స్ టీమ్‌ల ఏర్పాటు!

    ఎన్టీఆర్: భారీ వర్షాల నేపథ్యంలో 43 మాన్‌సూన్ రెస్పాన్స్ టీమ్‌లను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్‌చంద్ర ఏర్పాటు చేశారు. డ్రైనేజీలు పొంగడం, కొండరాళ్లు జారడం, రోడ్లపై నీరు నిలవడం వంటి సమస్యల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి టీమ్‌లు కీలకమని తెలిపారు. శానిటేషన్, ప్లానింగ్, ఇంజనీరింగ్ సిబ్బంది మూడు షిఫ్ట్‌లలో అందుబాటులో ఉంటారన్నారు. సమస్యలపై వెంటనే సమాచారం ఇవ్వాలని కమిషనర్ సూచించారు.

  • అధికారులు అలర్ట్‌గా ఉండాలి: కలెక్టర్‌

    ఎన్టీఆర్‌ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రత్యేక పర్యవేక్షణ, వరద స్పందన బృందాలు సిద్ధంగా ఉండాలని, వరద పరిస్థితిని గ్రామాలకు తెలియజేయాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ (9154970454) ఏర్పాటు చేశారు. బుడమేరు, మున్నేరు, ప్రకాశం బ్యారేజ్‌లను నిరంతరం పర్యవేక్షించాలని, పునరావాస శిబిరాలు సిద్ధం చేయాలని సూచించారు.

  • కొండపల్లిలో ఘనంగా గణపతి పూజలు

    ఎన్టీఆర్: కొండపల్లిలోని ఇందిరా నగర్‌లో వినాయక చతుర్థి సందర్భంగా నవరాత్రి ఉత్సవాలలో గణపతి పూజలు అంగరంగ వైభవంగా జరిగాయి. మంచి ఆరోగ్యం, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు, వ్యాపారాభివృద్ధి కోసం గణపతి ఆశీస్సులు కోరుతూ పూజారి మల్లిఖార్జున చారి పూజలు చేశారు. కార్యక్రమంలో ఏడీ వెంకటేశ్వరావు, అవులూరి వెంకట రామిరెడ్డి, ఉప్పలపాటి రాజశేఖర్, కొమ్మూరు వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.

  • హంసలదీవి బీచ్ గేట్లు మూసి వేత

    కృష్ణా: కోడూరు మండలంలో హంసలదీవి బీచ్ గేట్లు మూసి వేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాతావరణ శాఖ వారి హెచ్చరికను అనుసరించి బీచ్ గేట్లు మూసివేసినట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నాగమణి తెలిపారు. బుధవారం సముద్రపు అలలు ఎగిసి పడుతున్న నేపథ్యంలో పాలకాయ తిప్ప వద్ద అటవీ శాఖావారి ఆవరణలో ఉన్న హంసలదీవి బీచ్ గేటును 2రోజులు మూసి వేస్తున్నామన్నారు.

     

  • నూజివీడు టీడీపీ కార్యాలయంలో వినాయక పూజలు

    ఏలూరు: నూజివీడు టీడీపీ కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు జరిపారు. కూటమి నేతలు భక్తి శ్రద్ధలతో గణనాథుడి ఆరాధించారు. ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి కొలుసు పార్థసారథి ఫోన్‌లో ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే వినాయకుడి ఆశీస్సులతో నూజివీడు నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో, సుభిక్షంగా జీవించాలని కోరుకున్నారు.

     

     

  • మట్టి వినాయక ప్రతిమల పంపిణీ

    ఎన్టీఆర్: వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టితో తయారైన వినాయక ప్రతిమలు, పత్రికలను ఏపీ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కంచికచర్ల శాఖ వారు ఉచితంగా పంపిణీ చేశారు. సంఘ అధ్యక్షుడు సానె రామ్మోహన్ రావు, ఇతర పెన్షనర్లు భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో నాగేశ్వరరావు, సర్వేశ్వరరావు, స్వర్ణలత, లక్ష్మణరావు, రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

     

     

  • మట్టి గణపతిని పూజించి.. జల కాలుష్యాన్ని అరికట్టి

    కృష్ణా: వినాయక చవితి పర్వదినం సందర్భంగా భక్తులు పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాను పూజించి, జల కాలుష్యాన్ని అరికట్టాలని అవనిగడ్డ నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ కోరారు. బుధవారం స్థానిక బస్టాండ్ సెంటర్‌లో కొల్లిపర బదరి వెంకటనారాయణ మెమోరియల్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సంయుక్త ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా వెంకట్రామ్ హాజరయ్యారు.

  • మంత్రి కొలుసు ఫ్రీ సర్వీస్.. గమ్యస్థానాలకు చేరేలా!

    ఏలూరు: భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో వదరల్లో చిక్కుకొని గమ్యస్థానానికి చేరుకోలేక నానా ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం మంత్రి కొలుసు పార్థసారధి ఉచిత వాహన సర్వీస్ ఏర్పాటు చేశారు. నూజివీడు నియోజకవర్గ పరిధిలో 4మండలాలు, పట్టణంలోని ప్రజల కోసం తన తండ్రి కొలుసు పెదరెడ్డియ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సర్వీస్‌ను అందిస్తున్నారు. ఉచితంగా ప్రజలు సర్వీస్‌ను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.

     

  • దుర్గమ్మ ఆలయంలో అమల్లోకి కొత్త రూల్స్‌

    AP: విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో బుధవారం నుంచి కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దర్శనానికి వచ్చేవారికి సాంప్రదాయ దుస్తులు లేకుంటే ఆలయంలోకి అనుమతించరు. అమ్మవారి ఆలయంలో సెల్‌ఫోన్ వాడకంపై కూడా పూర్తిగా నిషేధం విధించారు. ఆలయ సాంప్రదాయాలకు భంగం కలగకుండా ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రోటోకాల్ దర్శనాలకు వచ్చే వారు తమ సెల్‌ఫోన్లను ఆఫీసులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

  • వినయ ప్రదాత వినాయకుడు: MLA వసంత

    ఎన్టీఆర్: ప్రజలందరికీ మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. సర్వవిఘ్నాలను తొలగించి, సకల జనులకు జయాలను కలిగించి, ముప్పులకు ముగింపు పలికి, ప్రగతి ప్రయాణానికి మార్గం చూపించే వినయ ప్రదాత వినాయకుడని, ఆయన ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. పర్యావరణ హితంగా పండుగ జరుపుకుందామని, సరికొత్త సంకల్పాలకు శ్రీకారం చుడదామని, సంకల్పసిద్ధి దిశగా కృషి సాగిద్దామన్నారు.