Locations: Krishna

  • కంచికచర్లలో ఏకధాటిగా వర్షం

    ఎన్టీఆర్: కంచికచర్లలో గత రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో రైతులు వేలాది క్వింటాళ్ల పెసలు, మినుములు. అల్పపీడన ప్రభావంతో ఆకస్మాత్తుగా ఈ ప్రాంతంలో వర్షం ప్రారంభం కావడంతో పెసలు, మినుములు తడవకుండా రైతులు టార్పాలిన్ పట్టలతో జాగ్రత్తలు తీసుకున్నారు.

     

     

  • బాలగణపతి ఆలయంలో ఘనంగా ఉత్సవాలు

    కృష్ణా: గుడివాడలోని శ్రీరాంపురం పుల్లలపాడులో ఉన్న శ్రీ బాలగణపతి దేవాలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితులు స్వర్ణ శివరామకృష్ణ మంత్రోచ్ఛరణల మధ్య ముహూర్త సమయమైన 7.25నిమిషాలకు స్వామివారి ఉత్సవ మూర్తిని ప్రతిష్టించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సెప్టెంబర్ 6వ తేదీ వరకు శాస్త్ర ప్రకారం ఉత్సవాలు జరుగుతాయని దేవస్థాన కమిటీ పెద్దలు మల్లేశ్వరరావు, కోటేశ్వరరావు తెలియజేశారు.

  • మహాగణపతి.. విఘ్నాలు తొలగించి విజయాలందిస్తాడు

    ఎన్టీఆర్: ప్రజలందరికీ నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలు తొలగించి విజయాలందించే ఆ మహా గణపతి ఆశీస్సులతో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. గణాధిపత్యం పొందిన రోజైన వినాయకచవితి సందర్భంగా స‌త్కార్యాల‌న్నీ ఎటువంటి విఘ్నాలు లేకుండా విజ‌య‌వంతం కావాల‌ని, ఆ గ‌ణేషుడి కృపాక‌టాక్షాలు అంద‌రిపై ఉండాల‌ని ఆకాంక్షించారు.

     

  • ‘కిల్కారి కాల్స్‘ది వారి జీవితాల్లో కీలక పాత్ర

    కృష్ణా: గర్భిణులు, బాలింతల ఆరోగ్య భద్రతలో కిల్కారి కాల్స్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి(డీఎంహెచ్‌ఓ) శర్మిష్ట తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సేవ గర్భిణి నాల్గో నెల నుంచి శిశువు ఒక సంవత్సరం వచ్చే వరకు కొనసాగుతుందన్నారు. వారానికి ఒకసారి వచ్చే ఈ వాయిస్ కాల్స్ రెండు నిమిషాల వ్యవధిలో తల్లీబిడ్డల ఆరోగ్య సమాచారాన్ని అందిస్తాయన్నారు.

     

     

  • 30న కౌన్సిల్ సమావేశం

    కృష్ణా: పెడన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ఈనెల 30వ తేదీన నిర్వహించనున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ కటకం నాగకుమారి ఓ ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు సమావేశానికి తప్పకుండా హాజరు కావాలని ఆమె కోరారు.

  • సదరం శిబిరాలు.. రేపే షురూ!

    కృష్ణా: మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో ఈనెల 28వ తేదీ నుంచి సదరం శిబిరాలు నిర్వహిస్తున్నట్లు గూడూరు ఇన్‌ఛార్జ్ ఎంపీడీఓ కె.వి.రామకృష్ణ తెలిపారు. ఆగస్టులో నోటీసులు జారీ అయి సదరం శిబిరానికి హాజరుకాని దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారుల కోసమే శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

  • లారీని ఢీకొన్న బైక్.. లాయర్ మృతి

    కృష్ణా: గన్నవరంలోని చార్మినార్ టీ క్యాంటీన్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనకనుండి బైక్ ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనదారుడు మృతిచెందాడు. విజయవాడ నుంచి ఏలూరు వైపు వెళ్లే క్రమంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతిచెందిన వ్యక్తి విజయవాడ(పోరంకి)కు చెందిన లాయర్ ఎంవీవీ. వెంకటేశ్వరరావుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • మట్టి గణపతి.. పర్యావరణ హితం

    కృష్ణా: చల్లపల్లి ప్రెస్ క్లబ్, లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన సెంటర్లో మట్టితో తయారుచేసిన గణపతి ప్రతిమలను ఉచితంగా పంపిణీచేశారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మధుసూధనరెడ్డి, జాయింట్ సెక్రటరీ షేక్ ఎజాజ్ అహ్మద్, ఉపాధ్యక్షుడు లీలాబ్రహ్మేంద్ర, సభ్యులు హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకై మట్టి గణేషుడి విగ్రహాలను అందజేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

     

  • జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా దేవానంద్

    ఏలూరు: మండవల్లికి చెందిన డా.మెండా దేవానంద్‌ కుమార్‌ జాతీయ ఉత్తమ అధ్యాపకునిగా ఎంపికయ్యారు. కృష్ణా జిల్లా మైలవరంలోని లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా దేవానంద్‌ పనిచేస్తున్నారు. 38 పరిశోధక పత్రాలు, పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సులు నిర్వహించి, ఐదు గ్రంథాలు రాశారు. గురు పూజోత్సవం రోజు సెప్టెంబరు 5న న్యూఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనున్నారు.

  • ‘ఎరువులు బ్లాక్‌లో విక్రయాలు అవాస్తవం’

    ఎన్టీఆర్: జి.కొండూరు మండలం చెవుటూరు సొసైటీలో పారదర్శకంగా ఎరువులు పంపిణీ జరుగుతుందని పీ.ఏ.సీ.ఎస్ అధ్యక్షుడు ఈమని మురళీకృష్ణ మంగళవారం అన్నారు. ఎరువులు అధిక ధరలకు బ్లాక్‌లో విక్రయాలు అవాస్తవమని, కావాలని వైసీపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారాన్నారు. జి.కొండూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మురళీకృష్ణ వెల్లడించారు.