Locations: Krishna

  • పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాల పంపిణీ

    కృష్ణా: పర్యావరణ రహిత మట్టి విగ్రహాలతో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుపుకోవాలని ఘంటసాల ఎస్ఐ కె.ప్రతాప్ రెడ్డి అన్నారు. ఘంటసాల సెంటర్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో 100 మట్టి వినాయక విగ్రహాలను ఎస్ఐ ప్రతాప్ రెడ్డి చేతులు మీదగా ప్రజలకు మంగళవారం ఉచితంగా పంపిణీ చేశారు. ఎస్ఐ మాట్లాడుతూ.. వినాయక చవితి వేడుకలను కమిటీ సభ్యులు సమన్వయంతో నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలన్నారు.

  • ఘనంగా వినాయక చవితి సంబరాలు

    ఏలూరు: శ్రీవైష్ణవి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో వినాయక చవితి సంబరాలు ఘనంగా జరిగాయి. మంగళవారం శ్రీ వైష్ణవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రకృతితో కూడినటువంటి మట్టి వినాయకుని విగ్రహం ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో వినాయకునికి అతి ప్రియమైన కుడుములుతో నైవేద్యం సమర్పించారు. విద్యార్థులు ప్రకృతితో కూడినటువంటి మట్టి వినాయకుని ప్రతిమలు తయారు చేసి మండపములు అలంకరించారు.

  • ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని పూజించాలి: DSP

    కృష్ణా: గన్నవరం పోలీస్ స్టేషన్‌లో మంగళవారం సీఐ శివప్రసాద్ ఆధ్వర్యంలో డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు చేతుల మీదగా పట్టణ ప్రజలకు మట్టి గణపతి ప్రతిమలు పంపిణీ చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలన్నారు. అందులో భాగంగా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని పూజించాలని తెలిపారు.

  • కబ్జా స్థలాలలో బోర్డులు ఏర్పాటు

    ఎన్టీఆర్: కొండపల్లి ఖిల్లా రోడ్డు గుంట కోరి సమీపంలో సుమారు 25 సెంట్లు కొండ పోరంబోకు స్థలం కబ్జాకు గురైంది. కొందరు ప్రైవేటు వ్యక్తులు స్థలాన్ని ఆక్రమించి వెంచర్ వేశారు. విషయం తెలుసుకున్న ఇన్‌ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ మోస్మి ఆక్రమిత స్థలంలో బోర్డు ఏర్పాటు చేశారు. మున్సిపల్ స్థలం ఎవరో ఆక్రమించిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

  • యూరియా వస్తోంది.. ఆందోళన వద్దు: మంత్రి

    ఏలూరు: రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. ఎరువులు, ముఖ్యంగా యూరియా లభ్యత, సరఫరాపై సీఎస్,డీజీపీ,ఇంటెలిజెన్స్, వ్యవసాయశాఖ, విజిలెన్స్ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారన్నారు. త్వరలో రైతులకు ఎటువంటి కొరత లేకుండా ఎరువులు సరఫరా చేస్తామన్నారు. ఎరువుల కోసం రైతులు పడిగాపులు పడే పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంతి అదేశించారని రైతులు ఆందోళన చెందనవసరం లేదన్నారు.

  • వినాయక చవితి మండపాలకు ఉచిత విద్యుత్..!

    ఎన్టీఆర్: వినాయక చవితి సందర్భంగా ఉత్సవ సమితులు, మండపాల నిర్వాహకులకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందించేందుకు అంగీకరించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు దుర్గా పండిళ్లకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌కు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ధన్యవాదాలు తెలిపారు.

  • కబ్జా స్థలాలలో బోర్డులు ఏర్పాటు

    ఎన్టీఆర్: కొండపల్లి ఖిల్లా రోడ్డు గుంట కోరి సమీపంలో సుమారు 25 సెంట్లు కొండ పోరంబోకు స్థలం కబ్జాకు గురైంది. కొందరు ప్రైవేటు వ్యక్తులు స్థలాన్ని ఆక్రమించి వెంచర్ వేశారు. విషయం తెలుసుకున్న ఇన్‌ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ మోస్మి ఆక్రమిత స్థలంలో బోర్డు ఏర్పాటు చేశారు. మున్సిపల్ స్థలం ఎవరో ఆక్రమించిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

  • ‘కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలి’

    కృష్ణా జిల్లాకు స్వర్గీయ వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. లక్షలాది వంగవీటి రంగా అభిమానుల మనోభావాలను గౌరవించి జిల్లాకు వంగవీటి రంగా నామకరణం చేయాలని చందు జనార్దన్ కోరారు.

     

  • గణేష్ ఉత్సవాలపై సబ్ కలెక్టర్ సమీక్ష

    ఏలూరు: నూజివీడు డివిజన్‌లో వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా, ధ్వని కాలుష్యం లేకుండా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఊరేగింపుల సమయంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో నూజివీడు డీఎస్పీ ప్రసాద్ పాల్గొన్నారు.

  • అలా చేయకుంటే.. మునిసిపల్ నిబంధన ప్రకారం చర్యలే..!

    ఏలూరు: నూజివీడు పట్టణంలోని ఖాళీ స్థలాల్లో పెరిగిన మొక్కలు, చెట్లను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి మంగళవారం తెలిపారు. మొక్కలు, చెట్లు పెరగడంతో విష సర్పాలకు నిలయమై స్థానికులకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ఖాళీ స్థలాలను బాగు చేయించని నేపథ్యంలో మునిసిపల్ నిబంధన ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.