Locations: Krishna

  • రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

    ఏలూరు: గణనాథుడి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండి సుఖ సంతోషాలతో జీవించాలని, విగ్నేశ్వరుని దయతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. పాడి పంటలతో ప్రజలంతా సంతోషంగా జీవించాలని మంత్రి పేర్కొన్నారు. విగ్నేశ్వరుని దయ రాష్ట్రంపై, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉండాలని తద్వారా మంచి పరిపాలన అందించాలన్నారు.

     

  • ఎమ్మెల్యే యార్లగడ్డ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు

    కృష్ణా: గత కొన్ని రోజులుగా ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వైరల్ ఫీవర్ కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. ఎమ్మెల్యే త్వరగా కోలుకుని నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని బాపులపాడు మండలం అంపాపురం గ్రామ టీడీపీ నాయకులు,కార్యకర్తలు గ్రామంలోని సీతారామాంజనేయస్వామి దేవస్థానంలో ఎన్ఆర్ఐ కోడె రేవంత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 101కొబ్బరికాయలు కొట్టి దైవానికి నైవేద్యాలు సమర్పించారు.

  • పరిటాల ఆంజనేయ గుడిలో చోరీ.. ద్వారాన్ని పగలగొట్టి..

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలం పరిటాల హైవే మీద ఆంజనేయస్వామి గుడిలో అర్ధరాత్రి సమయంలో చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి, ఉత్తర ద్వారాన్ని పగలగొట్టి, గర్భగుడిలోని సుమారు 10 కేజీల వెండి ఆభరణాలు, కొంత నగదు దొంగిలించారు. ఆలయ సూపర్వైజర్ బోడిపూడి రామరావు ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్ఐ విశ్వనాధ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • ‘మట్టి విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ’

    ఎన్టీఆర్: కంచికచర్ల పట్టణంలో నందిగామ నియోజకవర్గ ప్రెస్‌క్లబ్ సభ్యులు ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహాలను నందిగామ రూరల్ సీఐ చవాన్, కంచికచర్ల ఎస్సై విశ్వనాథ్ పంపిణీ చేశారు. సీఐ మాట్లాడుతూ.. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేయడం మంచి పరిణామం అని సీఐ చవాన్ అన్నారు.

     

  • ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాలి: ఐద్వా

    ఎన్టీఆర్: రాష్ట్రంలో గంజాయి మద్యం విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయని మహిళా సంఘం ఐద్వా జిల్లా కార్యదర్శి శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. విస్సన్నపేట సుందరయ్య భవనంలో ఐద్వా ఆధ్వర్యంలో విస్తృత సమావేశంలో ఆమె మాట్లాడారు. మద్యం, గంజాయి సేవించి మహిళపై అగత్యానికి పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలు వచ్చిన ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాలని ఆమె అన్నారు.

  • నిమ్రా అధ్యాపకుడికి ఉత్తమ ప్రొఫెసర్ అవార్డు

    ఎన్టీఆర్: నిమ్రా ఫార్మసీ కాలేజీలో ఫార్మా కాగ్నసి, ఫైటో కెమిస్ట్రీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ అవిరినేని రవికుమార్‌కు ఉత్తమ ప్రొఫెసర్ అవార్డు లభించింది. సైంటిఫిక్ లారిల్స్ అనే సంస్థ ఈ అవార్డును ప్రధానం చేసింది. ఫార్మసీ విద్యారంగంలో ప్రొఫెసర్‌గా అందించిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందించారు. నిమ్రా విద్యాసంస్థల యాజమాన్యం, కాలేజీ ప్రిన్సిపల్ అధ్యాపకులు, సిబ్బంది రవికుమార్‌కి అభినందనలు తెలిపారు.

  • వెంటనే స్పందించిన ఛైర్మన్.. ధన్యవాదాలు తెలిపిన ముస్లింలు

    ఎన్టీఆర్: కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపట్నం ముస్లిం శ్మశానవాటికలో పిచ్చి మొక్కలు, ముళ్ళకంప పెరిగి కార్యక్రమాలకు ఇబ్బందిగా మారింది. ముస్లిం సోదరులు మున్సిపల్ ఛైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబుకు వివరించగా, వెంటనే స్పందించి జేసీబీ సహాయంతో ముళ్ళకంపను తొలగించారు. పశ్చిమ ఇబ్రహీంపట్నంలోని షాది ఖానా వద్ద కూడా పిచ్చి మొక్కలను తొలగించారు. చైర్మన్ పనులను పర్యవేక్షించగా, ముస్లిం సోదరులు ధన్యవాదాలు తెలిపారు.

  • ‘పార్టీ బలోపేతం చేయాలి’

    ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షురాలు పోలే శాంతి, బీజేపీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్‌ను రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో తిరువూరు ఏఎంసి డైరెక్టర్ అబ్బినేని చంద్రశేఖర్, శివాలయం కమిటీ డైరెక్టర్ కొత్తూరు ప్రసన్న కలిశారు. తిరువూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేయాలని అడ్డూరి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి, జిల్లా ట్రెజరర్ బుల్లబ్బాయిని కలసి శుభాకాంక్షలు తెలిపారు. అబ్బినేని, కొత్తూరుని శాలువాలతో సన్మానించారు.

  • పర్యావరణ హితమైన మట్టి గణనాథుని పూజిద్దాం: MLA

    ఎన్టీఆర్: పర్యావరణ హితమైన మట్టితో చేసిన గణనాథులను పూజిద్దామని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పిలుపునిచ్చారు. మదర్ థెరిసా ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకురాలు కోయ సుధ, శ్రీరేణుక ఎల్లమ్మ త్రిశక్తి పీఠం ఆధ్వర్యంలో మట్టితో రూపొందించిన వినాయక విగ్రహాలను స్థానిక ఎమ్మెల్యే మైలవరంలో పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం పంపిణీ చేశారు.

  • భూమన వ్యాఖ్యలపై కొల్లు రియాక్షన్ ఇదే

    కృష్ణా: TDR బాండ్ల వ్యవహారంలో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిపై వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. తణుకు, తాడేపల్లిగూడెం, తిరుపతి, గుంటూరు ప్రాంతాల్లో భారీగా టీడీఆర్ బాండ్లలో అవినీతి జరిగిందని.. దీనిపై ఇప్పటికే విచారణ కొనసాగుతుందని తెలిపారు. శ్రీలక్ష్మి గురించి ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారంటే.. ఎంతపెద్ద అవినీతి జరిగిందో రాష్ట్ర ప్రజలు గమనించాలన్నారు.