Locations: Krishna

  • అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు: MLA

    ఎన్టీఆర్: ‘స్త్రీ శక్తి’ పథకం అమలు నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలతో విజయోత్సవ ర్యాలీ, సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హాజరయ్యారు. మహిళలతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతున్న కూటమి ప్రభుత్వం హామీలన్నీ నెరవేరుస్తుందని, అభివృద్ధి, సంక్షేమంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

  • పేదల పూర్తి ఆరోగ్య భద్రత కూటమి ప్రభుత్వానిదే: మంత్రి

    ఏలూరు: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు మెరుగైన వైద్యం కోసం వేల కోట్లు కేటాయించిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. నూజివీడు నియోజకవర్గంలో నాలుగు కుటుంబాలకు రూ.11లక్షల ఎల్ఓసీ పత్రాలు అందజేశారు. చింతలవల్లి,వడ్లమాను,ముక్కోళ్లపాడు,పల్లెర్లమూడి గ్రామాలకు చెందిన కుటుంబాలకు రూ.1.5లక్షల నుంచి రూ.5లక్షల వరకు సహాయం అందించారు. గత వైద్య బిల్లులకు కూడా సీఎం సహాయనిధి ద్వారా తక్షణ ఆర్థికసహాయం అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

     

  • జీవనాధారం నీవేనయ్య..!

    కృష్ణా: పెడన 13వ డివిజన్‌లో ఐదు శతాబ్దాలుగా మట్టిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వినాయక చవితి సమీపిస్తే మట్టి గణనాధులకు ప్రాణం పోస్తూ, వివిధ ఆకృతులతో విగ్రహాలు తయారు చేస్తారు. సీజన్‌లో చేతినిండా పని లభిస్తుంది. వినాయక చవితి వస్తే చాలు పెద్దల నుంచి పిల్లల వరకు ఏకదంతుని ప్రతిమల తయారీలో నిమగ్నమవుతారు. 50 ఏళ్లుగా రౌతుల వీరాస్వామి ఉపాధి పొందుతున్నారని తెలిపారు.

  • ‘మట్టి విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ’

    ఎన్టీఆర్: నందిగామలో పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రామిరెడ్డి శ్రీధర్ నేతృత్వంలో గాంధీ సెంటర్‌లో 4850 మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. ఆర్డీఓ కె.బాలక్రిష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్, మునిసిపల్ కమిషనర్ లోవరాజు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మల్లెంపాటి ప్రసాద్, తదితరులు హాజరయ్యారు. 25ఏళ్లుగా మట్టి విగ్రహాలు, రెండేళ్లుగా విత్తనాలతో తయారైన విగ్రహాలు పంపిణీ చేస్తున్నామని, ప్రకృతి పరిరక్షణ అవసరమని శ్రీధర్ తెలిపారు.

  • ‘ఆశాలకు కనీస వేతనాలు అమలు చేయాలి’

    ఎన్టీఆర్: ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభ మంగళవారం మైలవరంలో ఘనంగా ప్రారంభమైంది. ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పత్తిపాటి జ్యోతి పతాకావిష్కరణ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి మాట్లాడుతూ.. ఆశాలకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఆశావర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు, ఆశాలు పాల్గొన్నారు.

  • ‘అక్రమాలను అరికట్టేందుకే స్మార్ట్ కార్డులు’

    ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలు గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని సర్పంచ్ కరణం రంగయ్య ప్రారంభించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆదేశాలతో, టీడీపీ నాయకుడు జంపాల సీతారామయ్య సూచనలతో ఈ కార్యక్రమం జరిగింది. ఐదో వార్డు సభ్యుడు కడియాల నాగేశ్వరరావు కార్డు అందుకున్నారు. స్మార్ట్ కార్డులతో అక్రమాలను అరికట్టి, ఇంటింటికీ పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.

  • అక్రమ రవాణాకు అడ్డుకట్ట..!

    ఎన్టీఆర్: తిరువూరు మండల పరిధిలో ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో పోలీస్ శాఖ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. ఇటీవల ఆంధ్రా నుంచి తెలంగాణకు ఇసుక, యూరియా అక్రమ తరలింపులను గ్రహించిన ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. పెద్దవరం, అక్కపాలెం, అష్టలక్ష్మి ఆలయం సమీపం, వేంసూర్ క్రాస్ రోడ్డు వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను సీఐ కె.గిరిబాబు, ఎస్ఐ కేవీజీ సత్యనారాయణ పరిశీలించారు.

  • వినూత్నంగా నాణేలతో పూలదండలు..!

    కృష్ణా: వినాయక చవితి ఉత్సవాలు సందర్భంగా పెడన అన్నా క్యాంటీన్ ఎదురుగల సయ్యద్ భాష దుకాణంలో ఆకర్షనీయంగా ఆకట్టుకునే రీతిలో కాయిన్స్‌తో పూలదండలు దర్శనమిచ్చాయి. ఏటా రకరకాల పూలదండలను విక్రయాలు చేయగా ఈ సంవత్సరం కొత్తగా ప్రజలకు రూపాయి నాణెలతో పూలదండలు తయారు చేయడం విశేషం. పలువురు చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  • ఇంటింటికీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

    ఎన్టీఆర్: రెడ్డిగూడెం మండలంలోని శ్రీరాంపురం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి పలువురికి క్యూఆర్ ఆధారిత నూతన స్మార్ట్ కార్డులను స్వయంగా అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈనెల 29 వరకు సచివాలయాల సిబ్బంది ఇంటింటికి తిరిగి బయోమెట్రిక్ వేయించుకుని కార్డులను అందజేస్తారని వెల్లడించారు.

  • ‘స్మార్ట్ కార్డులతో రేషన్ పంపిణీ సులభతరం’

    కృష్ణా: క్యూఆర్ కోడ్ సహిత స్మార్ట్ కార్డులతో రేషన్ పంపిణీ సులభతరమవుతుందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. అవనిగడ్డ మూడవ వార్డులో గుర్రపు చెరువు దగ్గర రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.45కోట్ల కుటుంబాలకు, కొత్త 6.70లక్షల మందికి కూడా కార్డులు అందిస్తున్నారు. వచ్చే నెల 15వరకు నాలుగు విడతల్లో పంపిణీ, బయోమెట్రిక్, IRIS సమస్యలు తొలగుతాయన్నారు.