Locations: Krishna

  • నీటి సమస్యపై స్పందించిన మేయర్!

    కృష్ణా: మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒకవైపు నీరు సరైన సమయానికి రాకపోగా, వచ్చిన నీరు కూడా పురుగులు, మురుగు వాసనతో వస్తుండటంపై నగర ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఐదు, పది నిమిషాలపాటు మాత్రమే నీరు రావడం వల్ల కుటుంబాల అవసరాలు తీరక సమస్యలు మరింత తీవ్రతరమయ్యాయని మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ ఖండించారు.

  • NTR జిల్లా వరల్డ్ రికార్డ్‌.. దేనికంటే

    AP : ఎకో ఫ్రెండ్లీ వినాయక తయారీలో NTR జిల్లా యంత్రాంగం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్, MPకేశినేని శివనాథ్(చిన్ని), విజయవాడ సెంట్రల్ MLA బోండా ఉమామహేశ్వరరావు, జిల్లా కలెక్టర్,  హాజరయ్యారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పినందుకు విజయవాడ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నామని MP చిన్ని పేర్కొన్నారు.

  • రాష్ట్ర అధికార భాషా సంఘానికి మండలి పేరు ఖరారు

    కృష్ణా: మాజీ మంత్రి, దివిసీమ గాంధీగా పేరొందిన మండలి వెంకట కృష్ణారావు పేరును రాష్ట్ర అధికార భాషా సంఘానికి పెడుతూ మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో విడుదల చేసింది. ఇకపై రాష్ట్ర అధికార భాషా సంఘం పేరును ‘మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా కమిషన్’గా మారుస్తున్నట్లు పేర్కొన్నారు. సంఘం కార్యకలాపాలు అన్నింటినీ అదేపేరుతో నిర్వహించాలన్నారు.

     

  • పెడనలో స్మార్ట్ కార్డుల పంపిణీ!

    కృష్ణా: పెడన మండలం ఎస్వీపల్లిలో మంగళవారం స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఇకనుంచి ఈ కార్డు ద్వారా సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి శీలం ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.

  • ఆలయంలో దొంగల హల్‌చల్.. సీసీ కెమెరాల్లో రికార్డ్!

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలం పరిటాల ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఉత్తరద్వారం గుండా లోపలికి ప్రవేశించిన దుండగులు గర్భాలయ తాళాలు పగలగొట్టి 7 కేజీల వెండి వస్తువులు,రూ.60వేల నగదు చోరీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా.. ముగ్గురు వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. క్లూం టీం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

     

  • ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ!

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలం పరిటాల ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. దొంగలు అర్ధరాత్రి సమయంలో ఉత్తర ద్వారం పగలగొట్టుకుని లోపలకు ప్రవేశించినట్లు సమాచారం. స్వామివారి కిరీటం మకర తోరణంతోపాటు మరికొన్ని వెండి, బంగారు వస్తువులు దొంగిలించారు. విషయం తెలుసుకున్న క్లూస్ టీం వారు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

  • ‘అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు’

    ఎన్టీఆర్: మైలవరంలోని పలు ఎరువుల దుకాణాలను రెవెన్యూ, వ్యవసాయ, పోలీస్ అధికారులు తనిఖీలు చేశారు. ఈపాస్‌లో ఎరువుల నిల్వలు, గోడౌన్లలో నిల్వలను పరిశీలించారు. అనంతరం తహశీల్దార్ అబ్దుల్ దరియా, ఏడి ఏ.శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రతి ఎరువుల షాపులో స్టాక్ బోర్డులను ప్రదర్శించాలన్నారు. ఎంఆర్పీ ధరలకే ఎరువులను అమ్మాలని, అధికంగా ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

  • గట్కా పోటీల్లో ZPHS విద్యార్థుల ప్రతిభ!

    ఎన్టీఆర్: విజయవాడు చిట్టూరి హైస్కూల్‌లో ఈనెల 24న జరిగిన జిల్లాస్థాయి గట్కా ఆటల పోటీల్లో పశ్చిమ ఇబ్రహీంపట్నం ZPHS విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఎస్.కె.కరీష్మా బంగారు పతకం, పి.క్రాంతికుమార్ వెండి పతకం, ఎం.గణేష్ కాంస్య పతకం, ఎ.అరవింద్ కాంస్య పతకాలు సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులను పీఈటీ రామశేఖర్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.

  • ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

    ఎన్టీఆర్: మైలవరంలో సోమవారం రాత్రి నూర్ బేగం (30) అనే వివాహిత తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

  • భక్తులకు అలెర్ట్‌.. ఇంద్రకీలాద్రిపై కొత్త రూల్‌

    AP : ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు డ్రెస్‌కోడ్‌ అమల్లోకి రానుంది. ఈ మేరకు విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలోడ్రెస్‌కోడ్‌ను అమలు చేస్తున్నట్లు ఆలయ EO శీనా నాయక్ అధికారిక ప్రకటన చేశారు. అభ్యంతరకర దుస్తులలో వచ్చే భక్తులకు దేవాలయంలోకి వచ్చేందుకు అనుమతి లేదు. భక్తులతో పాటు ఆలయ సిబ్బందికి డ్రెస్‌కోడ్‌ తప్పనిసరి చేశారు. ఈ కొత్త నిబంధనలు ఈనెల 27 నుంచి అమల్లోకి రానున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.