Locations: Krishna

  • ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

    ఎన్టీఆర్: మైలవరంలో సోమవారం రాత్రి నూర్ బేగం (30) అనే వివాహిత తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

  • భక్తులకు అలెర్ట్‌.. ఇంద్రకీలాద్రిపై కొత్త రూల్‌

    AP : ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు డ్రెస్‌కోడ్‌ అమల్లోకి రానుంది. ఈ మేరకు విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలోడ్రెస్‌కోడ్‌ను అమలు చేస్తున్నట్లు ఆలయ EO శీనా నాయక్ అధికారిక ప్రకటన చేశారు. అభ్యంతరకర దుస్తులలో వచ్చే భక్తులకు దేవాలయంలోకి వచ్చేందుకు అనుమతి లేదు. భక్తులతో పాటు ఆలయ సిబ్బందికి డ్రెస్‌కోడ్‌ తప్పనిసరి చేశారు. ఈ కొత్త నిబంధనలు ఈనెల 27 నుంచి అమల్లోకి రానున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

  • యూరియా సరఫరాలో కూటమి విఫలం: ఉప్పాల

    కృష్ణా: ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయలేక కూటమి ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుందని పెడన నియోజకవర్గ వైసీపీ ఇ‌న్‌ఛార్జ్ ఉప్పాల రమేష్ అన్నారు. బంటుమిల్లి మండలం, మల్లేశ్వరంలో బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. గత ఐదేళ్ళు పాలనలో రైతులకు ఎరువుల కొరత లేదన్నారు. ప్రజల కనీస అవసరాలు తీర్చే పరిస్థితిలో కూడా కూటమి ప్రభుత్వం లేదని విమర్శించారు.

     

  • రైతన్నలూ.. అప్రమత్తంగా ఉండండి: ఏఈ

    కృష్ణా: వర్షాకాలం నేపథ్యంలో పంట పొలాల వద్ద రైతులు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ షాక్‌లకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పెడన విద్యుత్ శాఖ ఏఈ పోలగాని ఏడుకొండలు ఒక ప్రకటనలో తెలిపారు. తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్దకు వెళ్లరాదని, విద్యుత్ సమస్యలను సొంతంగా పరిష్కరించే ప్రయత్నం చేయకుండా అధికారులకు తెలియజేయాలని ఆయన తెలిపారు.

  • చల్ల శ్రీనివాసరావును సత్కరించిన ఎమ్మెల్యే

    ఎన్టీఆర్: వీరులపాడు మండలం వీరులపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ మేరకు నూతనంగా ఎన్నికైన గ్రామ సొసైటీ ప్రెసిడెంట్ చల్ల శ్రీనివాసరావున శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.

  • చంద్రబాబు వాగ్దానాలు విఫలమయ్యాయి: మాజీ ఎమ్మెల్యే

    కృష్ణా: అవనిగడ్డలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సమన్వయకర్త సింహాద్రి రమేష్ “బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ” సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. మహిళల నగదు పంపిణీ, నిరుద్యోగ భృతి, తల్లికి వందనం డబ్బులపై ప్రశ్నించారు. జగన్‌ను 2029లో ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని, గ్రామీణ ఆర్థికాభివృద్ధి కోసం జగన్ కృషిని గుర్తించారన్నారు.

  • పొన్నవరం ఏకత్వ పాఠశాలలో ఫెన్సింగ్ జట్టు ఎంపిక

    ఎన్టీఆర్: వీరులపాడు మండలం పొన్నవరం ఏకత్వ పాఠశాలలో సోమవారం అండర్-17 ఫెన్సింగ్ బాలబాలికల జట్టు ఎంపికలు ఘనంగా జరిగాయి. కృష్ణా జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికైనవారు భీమవరంలో ఆగస్టు 29,30న రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు. కృష్ణాజిల్లా డీఎస్పీ పుప్పాల మహేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతిక కళలు సమతుల్యంగా పాటించాలని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు.

  • సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి: మంత్రి

    ఏలూరు: ప్రజల అర్జీలను స్వీకరించి, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, రెవెన్యూ, విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి తెలిపారు. 90% సమస్యలను వెంటనే పరిష్కరించి, అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంత్రి ప్రత్యేక గుర్తింపునకు ప్రజలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ.. కృతజ్ఞతలు తెలిపారు.

  • ‘యువత సహకారంతో గ్రామాభివృద్ధి సాధ్యం’

    కృష్ణా: అవనిగడ్డ నియోజకవర్గం వ్యాయామ ఉపాధ్యాయుల కార్ఖానా అని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం, మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా కోడూరు మండలం వీ.కొత్తపాలెం జడ్పీ హైస్కూల్లో అవనిగడ్డ సబ్ జోన్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఎమ్మెల్యే జాతీయ జెండా ఎగురవేసి పోటీలు ప్రారంభించారు. గ్రామస్థులు, యువత సహకారంతో గ్రామాభివృద్ధి సాధ్యమన్నారు.

  • ‘ఆధునిక సాంకేతికతతో స్మార్ట్ రేషన్ కార్డులు’

    కృష్ణా: చందర్లపాడు మండలం కోనయపాలెంలో సోమవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురాం, జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. స్మార్ట్ కార్డులు పారదర్శకంగా, సులభంగా రేషన్ సరుకులు అందించి, అవినీతిని నిరోధిస్తాయని, ఆధునిక సాంకేతికతతో సామర్థ్యం పెంచుతాయని సౌమ్య తెలిపారు.