కృష్ణా: కంచికచర్ల మండలంలోని గొట్టుముక్కల గ్రామంలో సోమవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. మండల టీడీపీ అధ్యక్షుడు, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కోగంటి బాబు లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఈ స్మార్ట్ కార్డులు పారదర్శకంగా, సులభంగా రేషన్ సరుకులు అందించడంతో పాటు అవినీతిని నిరోధిస్తాయని, గ్రామీణ పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని కోగంటి తెలిపారు.
Locations: Krishna
-
‘పార్టీకి నష్టం చేస్తే.. సస్పెండ్ చేస్తాం’
కృష్ణా: మచిలీపట్నంలో హోంగార్డ్‌పై దాడి ఘటనలో జనసేన నేత కర్రి మహేష్‌పై కేసు నమోదైంది. దీంతో జనసేన పార్టీ హైకమాండ్ ఆయన క్రియాశీలక సభ్యత్వాన్ని రద్దు చేసింది. మచిలీపట్నం నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్, DCMS ఛైర్మన్ బండి రామకృష్ణ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పార్టీకి నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
-
‘నేత్రదానం పట్ల విస్తృత అవగాహన అవశ్యం’
కృష్ణా: సమాజంలోని అన్ని వర్గాల ప్రజలలో నేత్రదానం పట్ల విస్తృత అవగాహన అవశ్యం అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం అవనిగడ్డలోని ఎస్వీఎల్ క్రాంతి డిగ్రీ కళాశాలలో జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా విజయవాడ ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వారిచే సుదర్శి మానవతా సేవా సంస్థ, అవనిగడ్డ ప్రెస్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నేత్రదాన అవగాహన సదస్సు నిర్వహించారు.
-
శాశ్వత పునరావాసం కల్పించండయ్యా..!
కృష్ణా: అవనిగడ్డ మండలం పాత ఎడ్లంకలో వరదలతో నివాసాలు కొట్టుకుపోతున్న నేపథ్యంలో గ్రామస్థులు గత 4రోజులుగా దీక్షలు చేస్తున్నారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా తహశీల్దార్‌ను కలిసి, 81 కుటుంబాలు భయంతో జీవిస్తున్నామని, అవనిగడ్డలో ఇళ్ల స్థలాలు కేటాయించి శాశ్వత పునరావాసం కల్పించాలని అర్జీలు సమర్పించారు. గ్రామ పరిరక్షణకు చర్యలు తీసుకున్న కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
-
అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పింఛన్లు: మంత్రి
ఏలూరు: నూజివీడు నియోజకవర్గంలో పింఛన్‌దారుల సదరం సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్‌లో పింఛన్లు కోల్పోవడంపై మంత్రి కొలుసు పార్థసారథి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పారదర్శకంగా పనిచేయాలని, పింఛన్ల తొలగింపు, పునరుద్ధరణపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. వైద్య పరీక్షలు, పత్రాల మంజూరులో అవకతవకలు జరగకుండా చూడాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
-
విచారణకు హాజరైన దేవినేని అవినాష్
పల్నాడు: సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌లో వైసీపీ నేత దేవినేని అవినాష్ విచారణకు హాజరయ్యారు. రెంటపాళ్లలో మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా నమోదైన కేసులో భాగంగా ఆయన పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఈకేసులో 130 మందికి పైగా వైసీపీ నేతలపై కేసు నమోదైంది. ఇప్పటికే మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజని, పేర్ని నాని, నేతలు గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, అప్పిరెడ్డిల విచారణ పూర్తైన సంగతి తెలిసిందే.
-
ఉయ్యూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
కృష్ణా: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్యం తీసుకొచ్చిన స్మార్ట్‌రేషన్ కార్డుల పంపిణీ నేటి నుంచి ప్రారంభం అయ్యింది. అందులో భాగంగా ఉయ్యూరు పట్టణం సుందరమ్మపేటలో సోమవారం స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. సచివాలయం సిబ్బంది రామకృష్ణ, మండల రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు రెడ్డిరమణ లబ్ధిదారుల ఇళ్లకువెళ్ళి కార్డులు అందజేశారు. 14వ వార్డు కౌన్సిలర్ వెంకటలక్ష్మి, 13వ వార్డు అధ్యక్షులు అప్పలనాయుడు పాల్గొన్నారు.
-
‘సహకార వ్యవస్థ అభివృద్ధికి ప్రభుత్వం కృషి’
కృష్ణా: సహకార వ్యవస్థ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. సోమవారం కోడూరు మండలం సాలెంపాలెంలో పీఏసీఎస్ కార్యాలయంలో సొసైటీ నూతన త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకార సభ జరిగింది. నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. వెంకట్రామ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షపాత ప్రభుత్వంగా పని చేస్తోందన్నారు.
-
ఘనంగా కోనాయపాలెం పీఏసీఎస్ పాలకవర్గ ప్రమాణస్వీకారం
ఎన్టీఆర్: చందర్లపాడు మండలం కోనాయపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పాలకవర్గ ప్రమాణస్వీకారం మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉమ్మడి జిల్లా కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టెం రఘురాం, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, కూటమి నేతలతో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు.
-
ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్
కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్‌ను నెలవారి తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తనిఖీ చేశారు. తొలుత గోడౌన్ సీళ్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అనంతరం సంబంధిత రికార్డులు పరిశీలించి రికార్డులో సంతకం చేశారు.