కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్‌ను నెలవారి తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తనిఖీ చేశారు. తొలుత గోడౌన్ సీళ్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అనంతరం సంబంధిత రికార్డులు పరిశీలించి రికార్డులో సంతకం చేశారు.
Locations: Krishna
-
‘బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యం’
ఎన్టీఆర్: నందిగామ పట్టణంలోని నారాయణ ఆంగ్లో వేదిక్ స్కూల్ దగ్గర నియోజకవర్గ బీజేపీ కార్యాలయాన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి కలిసికట్టుగా ఒక నాయకత్వంగా వెళ్తుందని తెలిపారు. ఎవరి పార్టీలు వాళ్లు పెంచుకుంటూ పొత్తు ధర్మం పాటిస్తూ ఎవరి నాయకత్వం వాళ్ళు వహిస్తూ ఈ క్రమంలో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన చేస్తున్నామని పేర్కొన్నారు.
-
19 నుంచి నారెడ్కో 11వ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్
ఎన్టీఆర్: కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నారెడ్కో సెంట్రల్ జోన్ 11వ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్‌ను విజయవాడలోని ‘ఏ’ కన్వెన్షన్‌లో సెప్టెంబర్ 19నుంచి 21వరకు నిర్వహిస్తుంది. 60కిపైగా రియల్ ఎస్టేట్ డెవలపర్లు,ఫైనాన్స్ సంస్థలు,ఇంటీరియర్, బిల్డింగ్ మెటీరియల్ బ్రాండ్లు పాల్గొంటాయి. గృహ కొనుగోలుదారులకు పారదర్శక ఫైనాన్స్ సపోర్ట్, ప్రాజెక్ట్ ఎంపికలు అందుబాటులో ఉంటాయి. నారెడ్కో అధ్యక్షుడు సందీప్ ప్రభుత్వ సానుకూల చర్యలను ప్రశంసించారు.
-
‘ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి’
ఏలూరు: నూజివీడు మండలం బోర్వంచ పంచాయితీలోని అమృత నగర్, రేగుంట, బుర్వంచ, కొత్తూరు నుంచి విజయవాడకు వెళ్ళే మార్గంలో అంబేడ్కర్ బొమ్మ సెంటర్ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రగాయాలతో బాధపడుతున్నారు. ఈ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని నూజివీడు జనసేన పార్టీ నాయకులు నూజివీడు సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
-
ఘనంగా ఆలయ నూతన కమిటీ ప్రమాణస్వీకారం
ఎన్టీఆర్: విస్సన్నపేట శ్రీగంగా పార్వతి సమేత చంద్రశేఖర స్వామివారి(శివాలయం) దేవస్థానం కమిటీ ఛైర్మన్, 8మంది సభ్యులు ప్రమాణస్వీకారం మహోత్సవం ఘనంగా జరిగింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు కొలికిపూడికు ప్రత్యేకమైన పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.
-
కేసరపల్లిలో వైఎస్ భారతీ రెడ్డి పర్యటన
కృష్ణా: గన్నవరం మండలం కేసరపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీ రెడ్డి పర్యటించారు. లెప్రసీ కాలనీలోని ఆర్సీఎం చర్చిలో నిర్వహించిన ప్రార్థనా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. విజయవాడ మదర్ థెరిసా ట్రస్ట్ ఆధ్వర్యంలో లెప్రసీ కాలనీలోని వ్యాధిగ్రస్తులతో మాట్లాడారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భారతీ రెడ్డి భరోసా ఇచ్చారు.
-
పెడనలో ఎరువుల షాపులపై ఆకస్మిక తనిఖీలు
కృష్ణా: వ్యవసాయం, రెవిన్యూ, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పెడన పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలపై సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్టాక్ రిజిస్టర్, బిల్లు పుస్తకాలను పరిశీలించారు. అధిక ధరలకు ఎరువులు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, రైతులకు బిల్లు ఇవ్వాలని, ఈ-పాస్ తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులు తెలిపారు.
-
నందిగామలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి
ఎన్టీఆర్: చందర్లపాడు బస్టాండ్ నుంచి రథం సెంటర్ వరకు పండ్ల వ్యాపారులు రోడ్డుకు అడ్డంగా తోపుడు బండ్లు వ్యాపారాలు చేస్తుండటంతో ట్రాఫిక్ ఇబ్బందిగా మారింది. రోడ్డుపైన తోపుడు బండ్లు పెట్టి వ్యాపారం నిర్వహిస్తే.. ట్రాఫిక్ నియంత్రణ కోసం కఠిన చర్యలు తప్పువని ఎస్సై నరేష్ హెచ్చరించారు. పండ్ల వ్యాపారాలు వారికి కేటాయించిన స్థలంలోనే వ్యాపారాలు నిర్వహించాలని, లేకుంటే జరిమానాలు విధిస్తామని ఆయన తెలిపారు.
-
ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకతకు పెద్దపీట: ఎమ్మెల్యే
ఎన్టీఆర్: ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ రోడ్డు వద్ద స్మార్ట్ రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. క్యూఆర్ కోడ్‌తో రూపొందిన ఈ కార్డులు ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలను అరికట్టి, పేదల అవసరాలకు ఉపయోగపడతాయన్నారు. జిల్లాలో 5,87,135, కొండపల్లి, ఇబ్రహీంపట్నంలో 15,300 కార్డులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
-
డా.పట్టాభి పేరును చిరస్థాయిగా నిలబెడుతాం: ఎంపీ
కృష్ణా: డా.పట్టాభి సీతారామయ్య పేరును మచిలీపట్నంలో చిరస్థాయిగా నిలబెడుతామని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. ఆయన పేరును చిరస్థాయిగా నిలిపేందుకు స్మారక భవన నిర్మాణానికి సెప్టెంబర్‌లో భూమిపూజ చేస్తామన్నారని, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కృషితో రూ.40 కోట్లు మంజూరయ్యాయన్నారు. రెండు విడతల్లో పట్టాభి స్మారక భవన నిర్మాణానికి కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.