Locations: Krishna

  • ‘ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి’

    ఏలూరు: నూజివీడు మండలం బోర్వంచ పంచాయితీలోని అమృత నగర్, రేగుంట, బుర్వంచ, కొత్తూరు నుంచి విజయవాడకు వెళ్ళే మార్గంలో అంబేడ్కర్ బొమ్మ సెంటర్ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రగాయాలతో బాధపడుతున్నారు. ఈ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని నూజివీడు జనసేన పార్టీ నాయకులు నూజివీడు సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

  • ఘనంగా ఆలయ నూతన కమిటీ ప్రమాణస్వీకారం

    ఎన్టీఆర్: విస్సన్నపేట శ్రీగంగా పార్వతి సమేత చంద్రశేఖర స్వామివారి(శివాలయం) దేవస్థానం కమిటీ ఛైర్మన్, 8మంది సభ్యులు ప్రమాణస్వీకారం మహోత్సవం ఘనంగా జరిగింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు కొలికిపూడికు ప్రత్యేకమైన పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.

  • కేసరపల్లిలో వైఎస్ భారతీ రెడ్డి పర్యటన

    కృష్ణా: గన్నవరం మండలం కేసరపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీ రెడ్డి పర్యటించారు. లెప్రసీ కాలనీలోని ఆర్సీఎం చర్చిలో నిర్వహించిన ప్రార్థనా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. విజయవాడ మదర్ థెరిసా ట్రస్ట్ ఆధ్వర్యంలో లెప్రసీ కాలనీలోని వ్యాధిగ్రస్తులతో మాట్లాడారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భారతీ రెడ్డి భరోసా ఇచ్చారు.

  • పెడనలో ఎరువుల షాపులపై ఆకస్మిక తనిఖీలు

    కృష్ణా: వ్యవసాయం, రెవిన్యూ, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పెడన పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలపై సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్టాక్ రిజిస్టర్, బిల్లు పుస్తకాలను పరిశీలించారు. అధిక ధరలకు ఎరువులు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, రైతులకు బిల్లు ఇవ్వాలని, ఈ-పాస్ తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులు తెలిపారు.

  • నందిగామలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి

    ఎన్టీఆర్: చందర్లపాడు బస్టాండ్ నుంచి రథం సెంటర్ వరకు పండ్ల వ్యాపారులు రోడ్డుకు అడ్డంగా తోపుడు బండ్లు వ్యాపారాలు చేస్తుండటంతో ట్రాఫిక్ ఇబ్బందిగా మారింది. రోడ్డుపైన తోపుడు బండ్లు పెట్టి వ్యాపారం నిర్వహిస్తే.. ట్రాఫిక్ నియంత్రణ కోసం కఠిన చర్యలు తప్పువని ఎస్సై నరేష్ హెచ్చరించారు. పండ్ల వ్యాపారాలు వారికి కేటాయించిన స్థలంలోనే వ్యాపారాలు నిర్వహించాలని, లేకుంటే జరిమానాలు విధిస్తామని ఆయన తెలిపారు.

  • ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకతకు పెద్దపీట: ఎమ్మెల్యే

    ఎన్టీఆర్: ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ రోడ్డు వద్ద స్మార్ట్ రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. క్యూఆర్ కోడ్‌తో రూపొందిన ఈ కార్డులు ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలను అరికట్టి, పేదల అవసరాలకు ఉపయోగపడతాయన్నారు. జిల్లాలో 5,87,135, కొండపల్లి, ఇబ్రహీంపట్నంలో 15,300 కార్డులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

  • డా.పట్టాభి పేరును చిరస్థాయిగా నిలబెడుతాం: ఎంపీ

    కృష్ణా: డా.పట్టాభి సీతారామయ్య పేరును మచిలీపట్నంలో చిరస్థాయిగా నిలబెడుతామని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. ఆయన పేరును చిరస్థాయిగా నిలిపేందుకు స్మారక భవన నిర్మాణానికి సెప్టెంబర్‌లో భూమిపూజ చేస్తామన్నారని, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కృషితో రూ.40 కోట్లు మంజూరయ్యాయన్నారు. రెండు విడతల్లో పట్టాభి స్మారక భవన నిర్మాణానికి కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

  • ఆ గ్రామస్థులకు విముక్తి కలిగేదెప్పుడు?

    కృష్ణా: ఇటీవల వరదల సమయంలో అవనిగడ్డ మండలం ఎడ్లంకకు చెందిన తెనాలి భాగ్యం(55) మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని సోమవారం కుటుంబ సభ్యులు పడవపై అవతలి ఒడ్డుకు తరలించారు. ఇలాంటి దుర్ఘటనల నుంచి తమ గ్రామానికి విముక్తి కల్పించాలని, ఎంతోకాలంగా బ్రిడ్జి నిర్మాణం కోసం గ్రామస్థులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటుందని, శాశ్వత పరిష్కారం చూపాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • ‘యువత సహకారంతో గ్రామాభివృద్ధి సాధ్యం’

    కృష్ణా: అవనిగడ్డ నియోజకవర్గం వ్యాయామ ఉపాధ్యాయుల కార్ఖానా అని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం, మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా కోడూరు మండలం వీ.కొత్తపాలెం జడ్పీ హైస్కూల్లో అవనిగడ్డ సబ్ జోన్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఎమ్మెల్యే జాతీయ జెండా ఎగురవేసి పోటీలు ప్రారంభించారు. గ్రామస్థులు, యువత సహకారంతో గ్రామాభివృద్ధి సాధ్యమన్నారు.

  • ‘స్మార్ట్ రేషన్ కార్డులతో సంక్షేమం వేగవంతం’

    ఎన్టీఆర్: కంచికచర్ల రేషన్ షాపుల వద్ద నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ డీలర్లతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కొత్త పథకాలను తీసుకొచ్చి అమలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు అందిస్తున్న ఈ కార్డుల ద్వారా మరింత పారదర్శకతతో, వేగవంతంగా సంక్షేమ పథకాల ప్రయోజనాలు లబ్ధిదారులకు చేరుతాయని పేర్కొన్నారు.