ఎన్టీఆర్: విజయవాడ పైపుల రోడ్డు నుంచి వాంబేకాలనీకి వెళ్లే దారిలో ఉన్న జన్నతుల్ భాగ్ ఖబ్రస్తాన్‌లో నమాజ్ చదువుకునేందుకు ‘గుసుల్ ఖానా’ ‘వజు ఖానా’ షెడ్డుల నిర్మాణ పనులను ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. అన్ని మతాల వారికి ప్రాధాన్యత ఇస్తూ వాంబేకాలనీ ఖబ్రస్థాన్‌ను రూ.40 లక్షలతో ఆధునికీకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు.
Locations: Krishna
-
నిషేధిత సిగరెట్ల పట్టివేత
కృష్ణా: నిషేధిత సిగరెట్ల అక్రమ రవాణా గుట్టురట్టు చేశారు అధికారులు. ఉయ్యూరుకు చెందిన సుబ్బారావు వద్ద రూ.5 లక్షల విలువైన సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. సిగరెట్లకు ఎటువంటి బిల్లులు లేవని కమర్షియల్ టాక్స్(జీఎస్టీ) అధికారి సౌమ్య తెలిపారు. గతంలోనూ నిషేధిత గుట్కా అక్రమ రవాణాపై ఇతనిపై పలు కేసులు ఉన్నాయన్నారు.
-
హోంగార్డ్‌పై దాడి.. జనసేన నేతపై కేసు
కృష్ణా: మచిలీపట్నంలో హోంగార్డ్ జి.మోహనరావుపై దాడి కేసులో జనసేన నేత కర్రి మహేష్‌పై కేసు నమోదైంది. బీఎన్ఎస్ 121(1), 351(2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గత అర్థరాత్రి విధుల్లో ఉన్న హోంగార్డ్‌పై మద్యం మత్తులో కర్రి మహేష్ దాడి చేసిన సంగతి తెలిసిందే. బాధిత హోంగార్డ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
‘అక్రమాలకు చెక్ పెట్టేందుకే స్మార్ట్ రైస్ కార్డ్’
కృష్ణా: రేషన్ పంపిణీలో అక్రమాలు అరికట్టేందుకే ప్రభుత్వం స్మార్ట్ రైస్ కార్డులను తీసుకొచ్చిందని సర్పంచ్ రాచూరి ప్రసాద్ బాబు తెలిపారు. సోమవారం ఘంటసాల మండలం తెలుగురావుపాలెం గ్రామంలో స్మార్ట్ రైస్ కార్డులను స్థానిక నాయకులతో కలిసి ఆయన పంపిణీ చేశారు. లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి అందజేశారు. మాజీ సర్పంచ్ ఆరుంబాక రవి, పంచాయతీ కార్యదర్శి సుధాకర్, వీఆర్వో కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
-
అవనిగడ్డ సబ్ జోన్ క్రీడలు ప్రారంభం
కృష్ణా: అవనిగడ్డ సబ్ జోన్ ఆటలు, క్రీడల పోటీలు సోమవారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. కోడూరు మండలం వీ.కొత్తపాలెం జడ్పీ హైస్కూలులో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేసి పోటీలు ప్రారంభించారు. ప్రతీ క్రీడాకారుడిని పలకరిస్తూ బుద్ధప్రసాద్ విషెస్ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా క్రీడాకారులు ఉత్సాహంగా తరలివచ్చారు.
-
కలెక్టరేట్ ఎదుట దివ్యాంగుల ధర్నా
కృష్ణాజిల్లా కలెక్టరేట్ ఎదుట దివ్యాంగుల JAC ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. పెన్షన్ల తొలగింపును నిరసిస్తూ దివ్యాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెన్షన్ల రీ వెరిఫికేషన్‌ను నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్‌కి వినతిపత్రం ఇచ్చారు. దివ్యాంగులకు అన్యాయం జరిగితే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమిస్తామని వైసీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ రాజు వెల్లడించారు.
-
పేదవారి ఇల్లు కూల్చడమేనా P4 : వెల్లంపల్లి
ఎన్టీఆర్: విజయవాడ జోజినగర్ కరెంట్ ఆఫీస్ రోడ్డులోని 42 ఫ్లాట్ల యజమానులతో కలిసి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నిరసన వ్యక్తంచేశారు. కోర్టును తప్పుదోవ పట్టించి స్థలాన్ని కబ్జాచేయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. మున్సిపల్ ప్లాన్, బ్యాంక్ లోన్ వంటి అన్ని అనుమతులతో నిర్మాణం జరిగిందన్నారు. జనసేన పార్టీ నేతలే కబ్జాకు పాల్పడుతున్నారని.. పేదవారి ఇల్లు కూల్చడమేనా P4 అంటే అని ప్రశ్నించారు.
-
గణేష్ మండపాలకు అనుమతి తీసుకోవాల్సిందే: సీఐ
ఎన్టీఆర్: గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరని సీఐ చంద్రశేఖర్ తెలిపారు. వినాయక చవితిని మత సామరస్యానికి ప్రత్యేకగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని చెప్పారు. డీజేలతో, ట్రాఫిక్ ఆంక్షలతో ఎవరికీ ఇబ్బంది కలిగించ వద్దన్నారు. గణేష్ నిమజ్జనం రోజున అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ సభ్యుల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే పర్మిషన్ కాన్సిల్ చేస్తామన్నారు.
-
సహకార సంఘాల పాత్ర కీలకం: కోగంటి
ఎన్టీఆర్: రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని కంచికచర్ల మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ అన్నారు. సోమవారం గొట్టుముక్కల గ్రామంలో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. సత్యనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొని నూతన పాలకవర్గసభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సంక్షేమంలో సహకార సంఘాల పాత్ర కీలకమన్నారు. గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
-
పడగ విప్పుతున్న పాములు
ఎన్టీఆర్ జిల్లాలో పాముకాట్ల సంఖ్య పెరుగుతోంది. విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రికి బాధితులు క్యూ కడుతున్నారు. ఈఏడాది ఏడు నెలలకు 214 మంది పాముకాటుకు గురికాగా, 210 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. నలుగురు మరణించారు. తాచుపాము, కట్లపాము కాటువేస్తే కొంత సమయం తర్వాత చేతులు, కాళ్ల కదలికలు ఆగిపోతాయని వైద్యులు చెబుతున్నారు. రక్తపింజర కాటు వేసిన 30 నిమిషాల్లో ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించాలని, లేకపోతే ప్రమాదకరమన్నారు.