కృష్ణా: మద్యం మత్తులో హోంగార్డ్‌పై జనసేన నాయకుడు దాడి చేశాడు. మచిలీపట్నం విశ్వబ్రాహ్మణ కాలనీలో ఈఘటన చోటుచేసుకుంది. అర్థరాత్రి నైట్‌బీట్‌లో ఉన్న హోంగార్డ్ జి.మోహనరావు వద్దకు 8వ డివిజన్ జనసేన నేత కర్రి మహేష్ బైక్‌పై వచ్చాడు. తాను వచ్చినప్పుడు లేచి నిలబడలేదంటూ హోంగార్డ్‌పై దాడికి పాల్పడ్డాడు. దీంతో హోంగార్డ్‌ను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తనపై అకారణంగా మహేష్ దాడి చేశాడంటూ హోంగార్డ్ ఫిర్యాదుచేశారు.
Locations: Krishna
-
సాయిక్రిష్ణకు నివాళులర్పించిన మండలి
కృష్ణా: నాగాయలంక మండలం వక్కపట్లవారి పాలెంకు చెందిన సాయిక్రిష్ణ గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన భౌతికకాయానికి అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ పూలమాలలతో నివాళులు అర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను, బంధువులు మాజీ DC చైర్మన్ అంబటి లక్ష్మణ ప్రసాద్‌ను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఓదార్పు ఇచ్చారు.
-
పెరటి కూరగాయలతో ఆరోగ్యం: ఛైర్మన్
ఎన్టీఆర్: ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు తెలిపారు. కొండపల్లి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) స్వయం సహాయక గ్రూపుల సమావేశం సిటీ మిషన్ మేనేజర్ శ్రీధరరావు అధ్యక్షతన ఇబ్రహీంపట్నం సచివాలయం 5లో జరిగింది. సహజసిద్ధంగా పెరట్లో పండించిన కూరగాయలను తీసుకుంటే కాన్సర్, తదితర రోగాల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించి విత్తనాలు పంపిణీచేశారు.
-
MBBS కన్వీనర్ కోటా సీట్ల జాబితా విడుదల
AP : ప్రస్తుత (2025-26) విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా మొదటి విడత MBBS సీట్ల కేటాయింపు జాబితాను విజయవాడలోని NTR ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో జాబితా ఉంచింది. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 25 మధ్యాహ్నం 3 గంటల తర్వాత విశ్వవిద్యాలయం రిజిస్ట్రేషన్ ఫీజు రూ.10,600 చెల్లించి కేటాయింపు పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవాలని వర్సిటీ అధికారులు తెలిపారు.
-
గణేష్ ఉత్సవాలు.. ఈ రూల్స్ పాటించండి
ఏలూరు: గణేష్ మండపాలను ప్రజారవాణా, వాహన రాకపోకలకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాటు చేసుకోవాలని ఆగిరిపల్లి ఎస్ఐ శుభశేఖర్ తెలిపారు. వినాయకచవితి సందర్భంగా విగ్రహాలను నెలకొల్పే ప్రాంతాలను సిబ్బందితో కలిసి ఆయన సందర్శించి పలు సూచనలు చేశారు. విద్యుత్ కనెక్షన్లు సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. శబ్ద కాలుష్యాన్ని నియంత్రిస్తూ, పర్యావరణానికి హానికరం కాని పద్ధతుల్లో వేడుకలు జరిపేలా నిర్వాహకులు బాధ్యత తీసుకోవాలని చెప్పారు.
-
సేవలకు గుర్తింపు.. ఘనంగా సత్కారం
ఎన్టీఆర్: కంచికచర్ల మండల బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన కాలవ మహేష్‌బాబును ప్రెస్ క్లబ్‌సభ్యులు ఘనంగా సన్మానించారు. గతంలో మహేష్ జిల్లా యువ మోర్చా మీడియా కన్వీనర్‌గా భాద్యతలు నిర్వహించారు. ఆయన సేవలను గుర్తించి అధ్యక్షుడి బాధ్యత్యలు కట్టబెట్టడంపై క్లబ్‌సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు మహేష్ మరిన్ని సేవలు అందిస్తూ భవిష్యత్తులో ఉన్నత పదవులు పొందాలని సభ్యులు ఆకాంక్షించారు.
-
ట్రాఫిక్ కష్టాలు తగ్గించేందుకు AI ఆధారిత యాప్
AP : విజయవాడ వాసులు నిత్యం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ట్రాఫిక్ జామ్. ఆ పద్మ వ్యూహంలో చిక్కుకున్నాక.. బయటకు వచ్చి వేరే మార్గంలో గమ్యస్థానం చేరాలన్నా సాధ్యం కాని పరిస్థితి. ఈ ఇబ్బందులను తగ్గించేందుకు నగర పోలీసు కమిషనర్ రాజశేఖర్‌బాబు.. AI ఆధారిత యాప్‌ను తయారు చేయిస్తున్నారు. DGP హరీష్‌కుమార్ గుప్తా త్వరలో దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
-
సైక్లింగ్‌తో ఆరోగ్యం: DCP
ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో బందర్ రోడ్డు వ్యాస్ కాంప్లెక్స్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు ‘Sunday’s on Cycle with State Police Forces” సైకిల్ ర్యాలీ నిర్వహించారు. డీసీపీ ఎస్.వి.డి. ప్రసాద్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి, సైక్లింగ్ ద్వారా ఆరోగ్యకరమైన శరీరం, ప్రశాంతమైన మనసు, సంతోషకరమైన జీవనశైలిని పొందవచ్చని తెలిపారు.
-
గణేష్ విగ్రహాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు ఇలా చేసుకోండి..
కృష్ణా: గణేష్ ఉత్సవాల నిర్వహణ, విగ్రహాల ఏర్పాటుకు అనుమతుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ఆగస్టు 25తో ముగియనుంది. https://ganeshutsav.net ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నామని బందర్ డీఎస్పీ సీహెచ్ రాజా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 450కి పైగా విగ్రహాలకు దరఖాస్తులు వచ్చాయని, శాంతిభద్రతలతో నిర్వహణకు సహకరించాలని, గడువు తర్వాత దరఖాస్తులు స్వీకరించబడవని, శబ్ద కాలుష్యం, ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులకు సహకరించాలని సూచించారు.
-
ఉన్నత పదవుల్లో ఉన్నారని తోటి మిత్రులు ఏం చేశారంటే..!
ఎన్టీఆర్: కంచికచర్ల మార్కెట్ యార్డు ఛైర్మన్‌గా కోగంటి వెంకట సత్యనారాయణ(బాబు), మండల విద్యాశాఖ అధికారిగా ఉప్పలూరి గురునాధంలను 1982 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ మిత్రులు పూర్వపు విద్యార్థులు సమ్మేళనంలో భాగంగా ఓసి క్లబ్‌లో ఘనంగా సన్మానించారు. రాజకీయాల్లో కోగంటి రెండున్నర దశాబ్దాల కృషి, నియోజకవర్గంలో ప్రత్యేక స్థానం సాధించడం అభినందనీయమన్నారు. ఇద్దరూ సమాజ సేవలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మిత్రులు ఆకాంక్షించారు.