ఎన్టీఆర్: కంచికచర్ల మండల బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన కాలవ మహేష్‌బాబును ప్రెస్ క్లబ్‌సభ్యులు ఘనంగా సన్మానించారు. గతంలో మహేష్ జిల్లా యువ మోర్చా మీడియా కన్వీనర్‌గా భాద్యతలు నిర్వహించారు. ఆయన సేవలను గుర్తించి అధ్యక్షుడి బాధ్యత్యలు కట్టబెట్టడంపై క్లబ్‌సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు మహేష్ మరిన్ని సేవలు అందిస్తూ భవిష్యత్తులో ఉన్నత పదవులు పొందాలని సభ్యులు ఆకాంక్షించారు.
Locations: Krishna
-
ట్రాఫిక్ కష్టాలు తగ్గించేందుకు AI ఆధారిత యాప్
AP : విజయవాడ వాసులు నిత్యం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ట్రాఫిక్ జామ్. ఆ పద్మ వ్యూహంలో చిక్కుకున్నాక.. బయటకు వచ్చి వేరే మార్గంలో గమ్యస్థానం చేరాలన్నా సాధ్యం కాని పరిస్థితి. ఈ ఇబ్బందులను తగ్గించేందుకు నగర పోలీసు కమిషనర్ రాజశేఖర్‌బాబు.. AI ఆధారిత యాప్‌ను తయారు చేయిస్తున్నారు. DGP హరీష్‌కుమార్ గుప్తా త్వరలో దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
-
సైక్లింగ్‌తో ఆరోగ్యం: DCP
ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో బందర్ రోడ్డు వ్యాస్ కాంప్లెక్స్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు ‘Sunday’s on Cycle with State Police Forces” సైకిల్ ర్యాలీ నిర్వహించారు. డీసీపీ ఎస్.వి.డి. ప్రసాద్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి, సైక్లింగ్ ద్వారా ఆరోగ్యకరమైన శరీరం, ప్రశాంతమైన మనసు, సంతోషకరమైన జీవనశైలిని పొందవచ్చని తెలిపారు.
-
గణేష్ విగ్రహాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు ఇలా చేసుకోండి..
కృష్ణా: గణేష్ ఉత్సవాల నిర్వహణ, విగ్రహాల ఏర్పాటుకు అనుమతుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ఆగస్టు 25తో ముగియనుంది. https://ganeshutsav.net ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నామని బందర్ డీఎస్పీ సీహెచ్ రాజా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 450కి పైగా విగ్రహాలకు దరఖాస్తులు వచ్చాయని, శాంతిభద్రతలతో నిర్వహణకు సహకరించాలని, గడువు తర్వాత దరఖాస్తులు స్వీకరించబడవని, శబ్ద కాలుష్యం, ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులకు సహకరించాలని సూచించారు.
-
ఉన్నత పదవుల్లో ఉన్నారని తోటి మిత్రులు ఏం చేశారంటే..!
ఎన్టీఆర్: కంచికచర్ల మార్కెట్ యార్డు ఛైర్మన్‌గా కోగంటి వెంకట సత్యనారాయణ(బాబు), మండల విద్యాశాఖ అధికారిగా ఉప్పలూరి గురునాధంలను 1982 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ మిత్రులు పూర్వపు విద్యార్థులు సమ్మేళనంలో భాగంగా ఓసి క్లబ్‌లో ఘనంగా సన్మానించారు. రాజకీయాల్లో కోగంటి రెండున్నర దశాబ్దాల కృషి, నియోజకవర్గంలో ప్రత్యేక స్థానం సాధించడం అభినందనీయమన్నారు. ఇద్దరూ సమాజ సేవలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మిత్రులు ఆకాంక్షించారు.
-
రైతులకు అండగా.. తెలుగుదేశం జెండా: MLA కొలికపూడి
ఎన్టీఆర్: రైతులకు అండగా తెలుగుదేశం జెండా ఉంటుందని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా తిరువూరు అయ్యప్పస్వామి టెంపుల్ నుంచి అష్టలక్ష్మి టెంపుల్ వరకు వందలాది టాక్టర్లతో రైతు సోదరులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా రైతు సంఘ ఉపాధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు, నాలుగు మండలాల కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-
‘టీడీపీ ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలి’
కృష్ణా: జూనియర్ ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతపురం రూరల్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పాలని గుడివాడ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేశారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం వద్ద స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అనంతరం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. అలాగే ఎమ్మెల్యే ఫ్లెక్సీని ఎన్టీఆర్ అభిమానులు దగ్ధం చేశారు.
-
పార్టీ బలోపేతం కోసం కృషి చేయండి: మంత్రి కొల్లు
కృష్ణా: టీడీపీ మచిలీపట్నం పార్లమెంట్ కమిటీ ఏర్పాటుపై సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఛైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని సూచించారు.
-
చంద్రబాబు సర్కార్‌పై శోభనాద్రీశ్వరరావు సంచలన వ్యాఖ్యలు!
ఎన్టీఆర్: చంద్రబాబు సర్కార్‌పై రైతు సంఘాల సమన్వయ సమితి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. మాజీ మంత్రి, రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. కరేడులో మూడు పంటలు పండే భూములను ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తుందంటూ ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కరేడు రైతులు వ్యతిరేకించారన్నారు.
-
‘ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలి’
ఎన్టీఆర్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పటమట సీఐ పవన్ కిషోర్ పేర్కొన్నారు. ఆదివారం ఆటోనగర్‌లోని పటమట పోలీస్‌స్టేషన్ రోడ్డులో పటమట సీఐ పవన్ కిషోర్ ఆధ్వర్యంలో ఆదిత్య ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా సీఐ పవన్ కిషోర్ మాట్లాడుతూ.. మొక్కలు నాటడం ద్వారా వాతావరణ సమతుల్యత సాధించవచ్చన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు.