Locations: Krishna

  • విక్కుర్తిని కలసిన పెన్ జర్నలిస్టు యూనియన్ నేతలు

    కృష్ణా: దివి ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గుర్తింపు పొందిన విక్కుర్తి వీరరాఘవయ్య ట్రస్టు ఛైర్మన్, పారిశ్రామికవేత్త విక్కుర్తి వెంకట శ్రీనివాస్‌ని పెన్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో ఆయనను పెన్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర నేతలు ప్రభాకర్, సింహాద్రి కృష్ణప్రసాద్, సాంబశివరావు, నాగేశ్వరరావు, ప్రసాద్, తదితరులు కలిసి వారి సేవా కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందించారు.

  • ‘ఆ గ్రామాభివృద్ధికి సీతారామాంజనేయులు కృషి’

    కృష్ణా: గోగినేనిపాలెం గ్రామ ప్రథమ సర్పంచ్ కీశే.మాలెంపాటి సీతారామాంజనేయులు గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని జడ్పీటీసీ తుమ్మల మురళీకృష్ణ, వైసీపీ నేత వేమూరి వెంకట్రావు కొనియాడారు. ఆదివారం ఘంటసాల మండలంలో ఆయన కాంస్య విగ్రహావిష్కరణ జరిగింది. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, సీడీసీ ఛైర్మన్‌గా, సర్పంచ్‌గా చెరకు రైతుల అభ్యున్నతి, పార్టీ బలోపేతం, గ్రామాభివృద్ధికి ఆయన చేసిన సేవలకు వైసీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

  • నందిగామలో యూరియ కొరత లేదు: అమ్మినేని

    ఎన్టీఆర్: వ్యాపారస్తులు కృత్రిమ యూరియా కొరత సృష్టించి అధిక లాభాల కోసం రైతులను ఇబ్బంది పెడుతున్నారని తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి అమ్మినేని జ్వాలా ప్రసాద్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య జోక్యంతో నందిగామ మార్కెట్ యార్డ్‌లో తక్కువ ధరలకు యూరియా, ఇతర ఎరువులు అందించారన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ యూరియా అందిస్తామని హామీ ఇచ్చారు.

  • విజయవాడ ప్రజలు నేటికీ కోలుకోలేదు: సీపీఎం

    ఎన్టీఆర్: గతేడాది వచ్చిన బుడమేరు వరదతో విజయవాడ ప్రజలు నేటికీ కోలుకోలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సీహెచ్‌ బాబూరావు అన్నారు. బుడమేరుకు వరద వచ్చి ఏడాది పూర్తి అవుతుందని, ఇప్పటికీ ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లా వాసులను రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆ సమయంలో వేల కోట్ల ఆస్తి నష్టం జరిగిందని, నేటికీ విజయవాడ ప్రజలు ఇంకా తిరిగి కోలుకోలేదని విమర్శించారు.

  • సర్పంచ్ పొలిమెట్ల ఏసుబాబుకు పరామర్శ

    కృష్ణా: మోపిదేవి మండలం పెదప్రోలులో గ్రామ పంచాయతీ సర్పంచ్ పొలిమెట్ల ఏసుబాబుకు మాతృవియోగం కలిగింది. ఆదివారం ఏసుబాబు మాతృమూర్తి మనోహరమ్మ మృతి చెందగా, ఆమె భౌతిక కాయాన్ని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. ఏసుబాబును పరామర్శించారు. మనోహరమ్మ మృతి పట్ల తమ సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

  • వికలాంగులకు అండగా వైసీపీ: సింహాద్రి

    కృష్ణా: మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లి గ్రామంలో తాడేపల్లి లక్ష్మణకు 2020లో 75% సదరం సర్టిఫికెట్ లభించగా, 2022 నుంచి పెన్షన్ వస్తోంది. 2025 వెరిఫికేషన్‌లో 40% కంటే తక్కువ వైకల్యం ఉందంటూ అనర్హత నోటీసు జారీ అయింది. పెన్షన్‌పై ఆధారపడిన లక్ష్మణ కుటుంబం ఆందోళనలో ఉంది. అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు వారిని పరామర్శించి, వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

  • ‘చిరస్మరణీయులైన సేవామూర్తులు ధన్యులు’

    కృష్ణా: పేదలకు విస్తృత సేవలు చేసి చిరస్మరణీయులైన సేవామూర్తులు మాలెంపాటి సీతారామాంజనేయులు, అత్తలూరి వెంకట పిచ్చియ్య ధన్యులు అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గోగినేనిపాలెంలో మాజీ సీడీసీ ఛైర్మన్ మాలెంపాటి సీతారామాంజనేయులు, యన్.జి.రంగా జిల్లా పరిషత్ హైస్కూల్ వ్యవస్థాపకులు అత్తలూరి వెంకట పిచ్చియ్య విగ్రహాలను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు.

  • గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి: CI

    కృష్ణా: గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి అని పమిడిముక్కుల సీఐ చిట్టిబాబు తెలిపారు. పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలనే పెట్టుకోవాలన్నారు. పందిళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కాన్ బెర్ కంపెనీకి చెందిన కెమెరాలు రూ.1200లకే లభిస్తున్నాయని చెప్పారు. కెమెరాలు ఉంటే అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవచ్చని పామర్రు సీఐ సుభాకర్ వెల్లడించారు. కార్యక్రమంపై నిర్వాహకులు బాధ్యతతో ఉండాలన్నారు.

  • 7న దుర్గ గుడి మూసివేత.. కారణమిదే..!

    ఎన్టీఆర్: చంద్ర గ్రహణం కారణంగా సెప్టెంబరు 7వ తేదీ మధ్యాహ్నం 3.30గంటల నుంచి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపైనున్న దుర్గామల్లేశ్వరస్వామి దేవస్ధానంలోని ప్రధాన ఆలయం, ఉపాలయాలన్నింటినీ మూసివేస్తున్నట్టు దేవస్ధానం ఈవో వికె.శీనానాయక్‌ తెలిపారు. ఆరోజు 3.30గంటలకు కవాట బంధనం చేయనున్నట్టు వైదిక కమిటీ తెలిపిందని శనివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. 8వ తేదీ ఉదయం 8.30గంటల నుంచి తిరిగి భక్తులకు దర్శనం ఉంటుందని వెల్లడించారు.

  • డిప్యూటీ సీఎం బౌన్సరుకు పరామర్శ

    కృష్ణా: నాగాయలంక మండలం భావదేవరపల్లిలో ఇటీవల ఆకుల రమాదేవి మృతి చెందగా ఆదివారం ఆమె సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. రమాదేవికి ముగ్గురు కుమారులు, ఒక అమ్మాయి కాగా, వారిలో ఒకరైన ఆకుల శివ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ దగ్గర సెక్యూరిటీ(బౌన్సర్)గా పనిచేస్తున్నారు. వారిని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, సర్పంచ్ ఉదయభాస్కర్, పీఏసీఎస్ అధ్యక్షులు శ్రీనివాసరావు పరామర్శించారు. రమాదేవి చిత్రపటానికి నివాళులర్పించారు.