నాగర్‌కర్నూల్: జిల్లాలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న లింగసానిపల్లి వంతెన నిర్మాణం పూర్తైంది. గత ప్రభుత్వంలో రూ.3.5కోట్లతో నిర్మించిన ఈ వంతెనతో ఎనిమిది గ్రామాల ప్రజల రవాణా కష్టాలు తీరాయి. విద్యార్థులు, రైతులు సులభంగా ప్రయాణించేందుకు వీలు కలగడంతో, గ్రామస్థులు మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Locations: నాగర్ కర్నూల్
-
కారు ఢీకొని వ్యక్తి మృతి
నాగర్‌కర్నూల్: కారు ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన చారకొండ మండలం మర్రిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై శంషుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎ.అచ్యా(55) రోడ్డు దాటుతుండగా కల్వకుర్తి నుంచి దేవరకొండకు వెళ్తున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తికి తరలించినట్లు తెలిపారు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.
-
జూరాలకు భారీ వరద..
మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్ట్ ఎగువ నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 32 గేట్లను తెరిచి దిగువకు శ్రీశైలం వైపు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లోకి 2,40,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 2,53,174 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతోంది. జూరాల పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.930 మీటర్ల వరకు నీరు ఉంది. ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాల్లో 12 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి జరుగుతోంది.
-
నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్
నాగర్‌కర్నూల్: కల్వకుర్తి పట్టణంలో ఆదివారం విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తున్నట్లు ఆ శాఖ ఏఈ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. తిలక్ నగర్, కల్యాణ్ నగర్, శిల్పరెస్టారెంట్, బ్రహ్మంగారి ఆలయం, తిమ్మినోనిపల్లి రోడ్డు, యూటీఎఫ్ భవన్ ప్రాంతాల్లో విద్యుత్ లైన్ల మరమ్మతులు చేపడుతున్నట్లు చెప్పారు. ఉదయం 11గంటల నుంచి 2 వరకు కరెంట్ ఉండదని పేర్కొన్నారు.
-
ఓపెన్ పది, ఇంటర్‌లకు దరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్‌నగర్: ఆర్థికంగా వెనుకబడి, చదువు మానేసిన యువతీ, యువకులు ఓపెన్ పది, ఇంటర్‌కు ఆదివారం సాయంత్రం వరకు దరఖాస్తులు చేసుకోవాలని ఎంఈవో సుధాకర్, రాజాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం సయ్యద్ ఇబ్రహీం తెలిపారు. రాజాపూర్, తిర్మలాపూర్ పాఠశాలల్లో తరగతుల నిర్వహణకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసినట్లు చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
-
పెద్దకాలువలో పడిపోయిన గుర్తు తెలియని వ్యక్తి
నాగర్ కర్నూల్: కల్వకుర్తి పట్టణంలోని అబూబకర్ ఫంక్షన్ హాల్ పక్కన ఉన్న వైన్ షాపుల దగ్గర ఓ గుర్తు తెలియని వ్యక్తి పెద్ద కాలువలో పడిపోయాడు. ఇందిరానగర్ కాలనీకి చెందిన చున్నుమియా, కల్వకుర్తి ఫైర్ ఆఫీసర్లు అతడిని రక్షించారు. సకాలంలో స్పందించి అతడిని కాపాడినందుకు చున్నుమియా, ఫైర్ సిబ్బందికి అందరూ బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
-
అచ్చంపేటలో టిఎల్ఎం మేళా ప్రారంభం
నాగర్‌కర్నూల్: అచ్చంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి టిఎల్ఎం (టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) మేళాను జిల్లా విద్యాధికారి ఏ.రమేష్ కుమార్ ప్రారంభించారు. విద్యార్థులలో సృజనాత్మకత పెంచడంలో, పాఠ్యాంశాలు సులభంగా అర్థం చేసుకోవడంలో టిఎల్ఎం కీలకమని ఆయన అన్నారు. ఉపాధ్యాయులు బోధనలో తప్పనిసరిగా టిఎల్ఎం ఉపయోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన టిఎల్ఎంను ఆయన పరిశీలించి విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు.
-
ప్రెస్ క్లబ్‌కు స్థలం కేటాయించాలని విజ్ఞప్తి
నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్‌లోని జర్నలిస్టులు, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటికొండ కృష్ణతో కలిసి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్‌ను కలిశారు. నాగర్‌కర్నూల్, కొల్లాపూర్‌లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ప్రెస్ క్లబ్‌కు స్థలం కేటాయించాలని వారు కోరారు. అలాగే ప్రెస్ క్లబ్‌కు తాత్కాలికంగా ఏదైనా ఖాళీ ప్రభుత్వ భవనం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఈసమస్యను పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.
-
పెట్రోల్ బంకులో ‘కైండ్‌నెస్ వాల్’
నాగర్‌కర్నూల్: పేదల కోసం జిల్లా పోలీస్ పెట్రోల్ బంకు వద్ద ‘కైండ్‌నెస్ వాల్’ ను జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ప్రారంభించారు. ఈ వాల్‌పై ప్రజలు తమకు అవసరంలేని వస్తువులను ఇతరుల కోసం ఉంచవచ్చు. అదే విధంగా, పేదలు తమ అవసరాలకు తగిన వస్తువులను ఉచితంగా తీసుకోవచ్చు. ఇది ప్రజల ముఖాలపై చిరునవ్వులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ప్రారంభించబడిందన్నారు.
-
రైతుపై చేయిచేసుకున్న ఎస్సై.. ఎస్పీ సీరియస్
నారాయణపేట: మరికల్ మండలం తీలేరు గ్రామంలో వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు యూరియా ఇవ్వాలని ఆందోళన చేస్తున్న క్రమంలో దురుసుగా ప్రవర్తించి, రైతుపై ఎస్సై చేయి చేసుకున్న వీడియో వైరల్ అవుతోంది. దీంతో రైతుపై చేయి చేసుకున్న మరికల్ ఎస్సై రాముపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఎస్పీ యోగేష్ గౌతమ్ పేర్కొన్నారు.