మహబూబ్‌నగర్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. బుధవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 3.31 లక్షల క్యూసెక్కులు, 3.63 లక్షల క్యూసెక్కులు ఔట్ ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు, విద్యుత్ ఉత్పత్తికి నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
Locations: నాగర్ కర్నూల్
-
ప్రభుత్వాసుపత్రిలో చవితి వేడుకలు
నాగర్‌కర్నూల్: ప్రభుత్వ ఆసుపత్రిలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మెడికల్ సూపరింటెండెంట్ డా. టి. ఉషారాణి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాలు పడకుండా కాపాడాలని గణపతిని వేడుకున్నారు. ఈ వేడుకల్లో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
-
కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది: శివశంకర్
నాగర్ కర్నూల్: తెలకపల్లిలో యూరియా కోసం రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డపాకుల శివశంకర్ అన్నారు. స్థానిక PACS వద్ద రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 4 రోజుల నుంచి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నా సకాలంలో అందడంలేదన్నారు. యూరియా కొరతను తీర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇప్పటికైనా యూరియా కొరతను తీర్చాలని డిమాండ్ చేశారు.
-
చినుకు పడితే చెరువే
నారాయణపేట: మక్తల్ బస్టాండ్ చిన్నపాటి వర్షానికే మినీ చెరువులా మారుతోంది. అధికారుల నిర్లక్ష్యం, గుంతల్లో మొరం వేసి మళ్ళీ తీయడం వల్ల ఈ సమస్య ఏర్పడింది. దీంతో ప్రయాణికులు, వ్యాపారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
-
జిల్లాలో వినాయక చవితి శోభ
మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మండపాలు, ఇళ్లలో గణనాథుని పూజల కోసం ప్రజలు అవసరమైన సామగ్రి కొనుగోలు చేయడానికి బయటికి రావడంతో ప్రధాన కూడళ్లు కిటకిటలాడుతున్నాయి. సాయంత్రం పూజలకు మండపాలు సిద్ధమవుతున్నాయి. ఈ పండుగ వాతావరణం జిల్లా అంతటా కనిపిస్తోంది.
-
జూరాలకు భారీగా వరద
మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తి 3,51,504 క్యూసెక్కుల నీటిని దిగువకు అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటిమట్టం 317.900 మీటర్లు (8.415 టీఎంసీలు)గా ఉంది. ప్రాజెక్టుకు 2,60,000 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. 5 పవర్ హౌస్‌లలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.
-
యూరియాపై సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
ఉమ్మడి పాలమూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన యూరియా సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి తన నియోజకవర్గానికి యూరియా ఎక్కువగా కేటాయించాలని కోరారు.
నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు పత్తి, మొక్కజొన్న, కందులు, మినుములు, వరి అధికంగా సాగు చేశారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రతీ రైతుకు కావాల్సినంత యూరియా సరఫరా చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు. -
సీఎం రేవంత్ రాజీనామా చేయాలి: మంద కృష్ణ
మహబూబ్‌నగర్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఫించన్లు పెంచడం చేతకాకపోతే సీఎం రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి, చేయూత పెన్షన్ దారుల ఆధ్వర్యంలో జడ్చర్ల నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఫించన్ల పెంపును డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 9న పరేడ్ గ్రౌండ్‌లో లక్షలాది మందితో మహా గర్జన నిర్వహిస్తున్నామని తెలిపారు.
-
పొలంలోకి దిగి యూరియా చల్లిన ఎమ్మెల్యే
మహబూబ్‌నగర్: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పొలంలోకి దిగి రైతులతో కలిసి యూరియా చల్లారు. నవాబ్‌పేట్ మండల పర్యటనలో భాగంగా చౌడూరు గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని రైతు పొలానికి వెళ్లి యూరియా చల్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. విపక్షాల ఆరోపణలు నమ్మి ఆందోళన చెందవద్దని సూచించారు.
-
ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్
నాగర్‌కర్నూల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికాలను ఆదేశించారు. మంగళవారం బిజినపల్లి మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ లబ్ధిదారు బీసం కృష్ణవేణి ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. గ్రామంలో మొత్తం ఎన్ని ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ వెంట బిజినపల్లి తహసిల్దార్ మున్నూరుద్దీన్ ఎంపీడీవో కాంతయ్య పాల్గొన్నారు.