నాగర్‌కర్నూల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను మెరుగుపరచడమే లక్ష్యంగా మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పాఠశాలలను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. పర్యవేక్షణ నామమాత్రంగా ఉండడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, యుడైస్ నమోదు ప్రక్రియలను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించాలని, ముఖ్యంగా గుడ్లను తప్పక అందించాలని స్పష్టం చేశారు.
Locations: నాగర్ కర్నూల్
-
పార్టీపై లూస్ టాక్ చేస్తే కఠిన చర్యలు: MLA
నాగర్‌కర్నూల్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ, ప్రభుత్వంపై సొంత నాయకులే తప్పుడు మాటలు మాట్లాడితే సహించబోనని, కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. ప్రజలకు సేవ చేయడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు.
-
బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నేతలు
జోగులాంబ గద్వాల: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గద్వాల్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ కేశవ్, 10 మంది కౌన్సిలర్లు, ఇతర ముఖ్య నేతలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి మాజీ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. వచ్చే నెల 6 లేదా 10న గద్వాల్‌లో భారీ సభ ఏర్పాటు చేసి బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం.
-
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ నాయకులు
నాగర్‌కర్నూల్: తెలకపల్లి మండలంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలకపల్లి పీఏసీఎస్ ఛైర్మన్ భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాములు, మాజీ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్లు అచ్యుతా రెడ్డి, శ్రీను గౌడ్ సహా పలువురు ముఖ్య కార్యకర్తలకు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
-
గంజాయి, డ్రగ్స్ సరఫరాను అరికట్టాలి: DYFI
నాగర్‌కర్నూల్: జిల్లాలో గంజాయి, డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నాగపూర్ మధు డిమాండ్ చేశారు. ఈ మేరకు డీవైఎఫ్‌ఐ కార్యకర్తల సమావేశం జిల్లా కార్యాలయంలో నిర్వహించి మాట్లాడారు. యువతను మాదక ద్రవ్యాల బారి నుంచి కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర డీవైఎఫ్‌ఐ నాయకులు పాల్గొన్నారు.
-
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద..!
మహబూబ్‌నగర్: జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు 16 గేట్లు ఎత్తి 1,78,542 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం వైపు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 318.110 మీటర్ల నీటి సామర్థ్యం ఉంది. అప్పర్, లోయర్ జూరాల పవర్ హౌస్‌లలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.
-
రాకపోకలు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశాలు
నాగర్‌కర్నూల్: తెలకపల్లి మండల పరిధిలోని రామగిరి రఘుపతిపేట రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీటిని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులతో కలిసి పరిశీలించారు. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్డు మీదకు వరద నీరు చేయడంతో ప్రజల రాకపోకలను పూర్తిగా నిరోధించాలన్నారు. 24 గంటలు పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వంతెన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు.
-
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
నాగర్‌కర్నూల్: బీజినపల్లి మండల పరిధిలోని గుడ్లనర్వ, కార్కొండ, వసంతపూర్, కుమ్మెర గ్రామాలకు చెందిన ప్రజలు తమ గ్రామాలకు వెళ్లే రోడ్డుపై ఉన్న పాలెం చెరువు అలుగుపై కొత్తగా నిర్మించిన బ్రిడ్జిపై కృతజ్ఞతలు తెలిపారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.