నాగర్‌కర్నూల్: ప్రజలు తమ సమస్యల పరిష్కారానికై ప్రజావాణిలోనే కాకుండా ఎప్పుడైన అర్జీలు ఇవ్వడానికి వచ్చే దరఖాస్తుదారులతో గౌరవంగా వ్యవహారించి దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయంతో కలిసి అర్జీలు స్వీకరించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో (47) ఫిర్యాదులు అందాయన్నారు.
Locations: నాగర్ కర్నూల్
-
నృత్యాలు చేస్తూ విద్యార్థులను ఉత్తేజపరిచిన కలెక్టర్
నాగర్‌కర్నూల్: వైద్య విద్యార్థినిలు నిర్వహించిన నృత్యాలలో కలెక్టర్ బాదావత్ సంతోష్ నృత్యాలు చేస్తూ విద్యార్థినీ విద్యార్థులను ఉత్తేజపరిచారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ సమీపంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వైద్యకళాశాల విద్యార్థులు నిర్వహించిన (ట్రెడిషనల్ డే) సాంప్రదాయ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు విద్యతోపాటు మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
-
‘జిల్లా అభివృద్ధికి పాటుపడాలి’
నాగర్‌కర్నూల్:జిల్లా కలెక్టర్‌గా బాదావత్ సంతోష్ బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం కలెక్టర్ ఛాంబర్‌లో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, వివిధ శాఖల జిల్లా అధికారులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా జిల్లా అధికారులు సమిష్టిగా కలిసి జిల్లా అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.
-
ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే
నాగర్‌కర్నూల్: బిజినేపల్లి మండలం కారుకొండ, వట్టెం, బిజ్నాపల్లి గ్రామాలలోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయి. సోమవారం ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి నిరుపేద కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
-
మంత్రి వాకిటి శ్రీహరికి ఘన సన్మానం
నాగర్‌కర్నూల్: హైదరాబాద్ డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు కొల్లాపూర్ ఎమ్మెల్యే, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించి సన్మానించారు. జూపల్లి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో సామాజిక న్యాయం పాటిస్తూ మంత్రి మండలి కూర్పు చేసిందన్నారు.
-
మంత్రి వాకిటిని కలిసిన ఎమ్మెల్యే
నాగర్‌కర్నూల్: పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి నియమితులయ్యారు. సోమవారం డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆయనను మర్యాదపూర్వంగా కలిసి పూలబొకే అందజేసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
-
నకిలీ మందులు విక్రయిస్తే కేసులు: ఎమ్మెల్యే
నాగర్ కర్నూల్: అచ్చంపేటలోని విత్తనాలు, ఫర్టిలైజర్ షాపులను ఎమ్మెల్యే వంశీకృష్ణ తనిఖీ చేశారు. అనంతరం స్టాక్ నిర్వహణ రికార్డులను, ఎరువుల బస్తాల లాట్ నంబర్లు, సోర్స్ సర్టిఫికేట్లను పరిశీలించారు. వ్యాపారులు నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు అవుతాయని ఆయన హెచ్చరించారు.
-
ఎంపీడీవోకు ఎన్టీఆర్ అవార్డు
నాగర్ కర్నూల్: వంగూర్ మండలం ఎంపీడీవో బ్రహ్మచారి ఎన్టీఆర్ అవార్డు అందుకున్నారు. సోమవారం రెయిన్‌బో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ, భారత్ వికాస పరిషత్ సంస్థలు హైదరాబాద్ కూకట్‌పల్లిలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశాయి. సత్య హరిచంద్ర నాటకంలో ఆయన చేసిన చంద్రమతి ఏకపాత్రాభినయానికి ఈ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన పలువురు ఎంపీడీవో బ్రహ్మచారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
-
బోల్ట్ ఊడిందా.. ఊహించని ప్రమాదమే..!
నారాయణపేట: మక్తల్ నుంచి నారాయణపేట వెళ్తున్న ఆర్టీసీ బస్సు మధ్యలో రంధ్రం పడి, ఒక కుర్చీ బోల్ట్ ఊడిపోయింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రమాదకర బస్సులు నడపడంపై ప్రయాణికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బస్సు ఏదైనా పెద్ద కుదుపుకు లోనైనప్పుడు జరిగే ప్రమాదం ఊహించలేనిదని.. తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
-
క్షణికావేశం.. భవనం పైనుంచి దూకిన మహిళ
మహబూబ్‌నగర్: జడ్చర్లలోని నేతాజీ చౌరస్తా వద్ద మూడు అంతస్తుల భవనంపై నుంచి దూకి అనూష(30) అనే నర్సు ఆత్మహత్య చేసుకుంది. క్షణికావేశంలో భవనంపై నుంచి దూకగా తీవ్రగాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భార్యాభర్తల మధ్య గొడవే ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాల తల్లి సాయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ కమలాకర్ తెలిపారు.