Locations: నాగర్ కర్నూల్

  • ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద

    జోగులాంబ గద్వాల: కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్టుకు 20వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, నెట్టెంపాడ్‌ ఎత్తిపోతల పథకం 1500, కోయిల్‌సాగర్‌ లిఫ్టుకు 315, విద్యుత్‌ ఉత్పత్తికి 19,805 క్యూసెక్కులు విడుదల చేయగా మొత్తం అవుట్‌ ఫ్లో 21,677 క్యూసెక్కులు నమోదైంది. పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6.019 టీఎంసీల నీటి నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలపారు.

  • వామ్మో.. చిరుత.. జర జాగ్రత్త

    మహబూబ్‌నగర్: దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్, ఈర్లగట్టు, గూడ్లగట్టు పరిసర గుట్టలో చిరుత పులి కలకలం రేపింది. కావున చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న గొర్ల కాపరులు,  రైతులు అప్రమత్తంగా ఉండాలని పలువురు కోరుతున్నారు. గుట్టల ప్రాంతాల్లో రాత్రి పూట వెళ్లరాదని గ్రామ యువకులు విజ్ఞప్తి చేశారు.

     

     

  • నీట్‌లో మంచి ర్యాంకు రాలేదని యువతి ఆత్మహత్య

    నాగర్ కర్నూల్: నీట్‌లో మంచిర్యాంకు రాలేదని యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వెల్దండ మండలం నారాయణపూర్ తండాలో చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాలప్రకారం.. తండాకు చెందిన ఇస్లావత్ శ్రావణి(19) ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శనివారం విడుదలైన నీట్ ఫలితాల్లో మంచిర్యాంకు రాకపోవడంతో మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడింది. రెండోప్రయత్నంలోనూ ర్యాంకు రాకపోవడంతో ఆత్మహత్య చేసుకుందని స్థానికులు తెలిపారు.

  • పూజ కోసం వెళ్లి.. అనంతలోకాలకు..

    మహబూబ్ నగర్ం మరికల్ మండలం పెద్దచింతకుంట గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. శివుని పూజ కోసం తామర పూలు సేకరించడానికి చెరువుకు వెళ్లిన మల్లేష్ (43) ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. ఎస్సై రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • అలర్ట్.. మూడు రోజులు వర్షాలు

    మహబూబ్‌నగర్: రానున్న మూడు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన హైదరాబాద్ వాతావరణ కేంద్ర హెచ్చరించింది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారుల అంచనా. ఈ మేరకు జిల్లాకు ఎల్లో అలర్ట్ ను అధికారులు జారీ చేశారు. ఈ సమయంలో గాలి వేగం గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వరకు ఉంటుందని అన్నారు.

  • మాజీ మంత్రికి అవార్డు

    మహబూబ్‌నగర్: మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డిని అవార్డు వరించింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా.. అత్యధిక స్థాయిలో రక్తదాతలకు ప్రేరణగా నిలిచిన ఆయనకు ఇండివిజివల్ హైయ్యెస్ట్ బ్లడ్ డోనర్ మోటివేటర్ అవార్డు ప్రకటించారు. హైదరాబాద్‌లోని రాజభవన్‌లో గవర్నర్ జిష్ణుదేవవర్మ చేతుల మీదుగా లక్ష్మారెడ్డి తరపున అవార్డును జడ్చర్ల బీఆర్ఎస్ నాయకులు కోడల్ యాదయ్య, ప్రణీల్చిందర్, నాగిరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి అందుకున్నారు.

  • నల్లమల అభయారణ్యంలో చిరుత

    నాగర్ కర్నూల్: నల్లమల సందర్శనకు వచ్చిన పర్యాటకులకు పెద్దపులి, చిరుతలు కనిపించాయి. మన్ననూరు సర్కిల్ అధికారి శ్రీకాంత్ కథనం ప్రకారం పర్యాటకులు ప్రత్యేక వాహనంలో ఫర్హాబాద్ చౌరస్తా నుంచి దృశ్య కేంద్రం సందర్శనకు వెళ్తున్నప్పుడు మార్గంమధ్యలో శిఖార్‌ఘర్ సమీపంలో రహదారిపై పెద్దపులి కనిపించింది. డ్రైవర్ పర్యాటకులను అప్రమత్తం చేసి పెద్దపులిని చూపించాడు. మరి కొందరు పర్యాటకులకు సాయంత్రం రెండు చిరుతలు కనిపించాయి.

  • కొత్తకోట వాసికి గద్దర్ అవార్డు

    మహబూబ్‌నగర్: రాష్ట్ర ప్రభ్వుత్వం ప్రకటించిన గద్దర్ ఆవార్డు కొత్తకోట మండలం కనిమెట్ట వాసి మద్దాలి వెంకటేశ్వర్రావును వరించింది. ఈయన నిర్మించిన ‘చదువుకోవాలి’ సందేశాత్మక చిత్రానికి ఈ అవార్డు దక్కడం పట్ల విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేశారు. సామాజిక బాధ్యతతో తీసిన చిత్రాల జాబితాలో చేర్చి వెంకటేశ్వర్రావుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పురస్కారం అందజేశారు.

  • 16న జిల్లాకు కాశి, ఉజ్జయిని, శ్రీశైల జగద్గురు పీఠాధిపతుల రాక

    మహబూబ్‌నగర్: శ్రీమహాత్మ బసవేశ్వర జయంతి 2025 ఉత్సవాలను పురస్కరించుకొని 16న స్థానిక శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఉజ్జయిని, కాశి, శ్రీశైల క్షేత్ర ఆది జగద్గురువులు విచ్చేయుచున్నారాని జిల్లా వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం అధ్యక్ష కార్యదర్శులు జెమినీ సురేష్,కే.రాజేష్‌లు తెలిపారు. ఈ ప్రాంతంలోని భక్తులు యుగ మహాత్సవ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

     

  • MBBS విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం

    నాగర్‌కర్నూల్: ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని నాగర్‌కర్నూల్ మెడికోస్ బ్లడ్ డోనర్స్ క్లబ్, బ్లడ్ బ్యాంక్, ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో 36మంది MBBS విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన విద్యార్థులకు గుర్తింపుగా, ప్రిన్సిపాల్ డా. ఎం. రమాదేవి ప్రశంసాపత్రాలు అందజేశారు.