Locations: నాగర్ కర్నూల్

  • ‘ఆ వార్త పూర్తిగా అవాస్తవం’

    నాగర్‌కర్నూల్: వరి కొనుగోళ్లపై రైతులను కలెక్టర్ బాదావత్ సంతోష్ ప్రశ్నించినట్లు వచ్చిన వార్తను ఆయన ఖండించారు. ప్రజావాణిలో అలాంటి సంఘటన జరగలేదని, ఇది పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేశారు. వార్తలు ప్రచురించే ముందు తన వివరణ తీసుకోవాలని పత్రికలకు సూచించారు.

  • ‘బాల కార్మికులు కనిపిస్తే చర్యలే’

    నాగర్‌కర్నూల్: జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తామని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. శుక్రవారం ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హోటళ్లు, వ్యాపార సంస్థలు, వ్యవసాయ పొలాలు, గృహాలలో బాల కార్మికులు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

     

  • ‘భూసేకరణను త్వరగా పూర్తి చేయాలి’

    నాగర్‌కర్నూల్: జిల్లాలో కొనసాగుతున్న కేఎస్ఐ, పాలమూరు-రంగారెడ్డి వంటి నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాజెక్టుల నిర్మాణానికి ఆటంకాలు లేకుండా, భూమి కొలతలు, పరిహారం పంపిణీ ప్రక్రియలను వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

     

  • డీఎస్పీ కార్యాలయంలో మెగా హెల్త్ క్యాంప్

    నాగర్ కర్నూల్: జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్‌ను ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ ప్రారంభించి మాట్లాడారు.. డ్యూటీలో బాగంగా పోలీసులు నిత్యం బిజీగా ఉంటారని, వారి హెల్త్ విషయంపై ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నామని, ఈ హెల్త్ క్యాంప్ లో 300 మంది సిబ్బంది చెకప్ చేసుకున్నట్టు తెలిపారు.

     

     

  • తడిసి ముద్దయిన కష్టం!

    నాగర్ కర్నూల్: కొల్లాపూర్‌లో కురుస్తున్న వర్షానికి మార్కెట్‌లో ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. తడిసిన ధాన్యం కుప్పలు చూపించి రైతులు బోరున విలపించారు. ధాన్యం విక్రయించేందుకు గత నెలలో కొల్లాపూర్‌ మార్కెట్‌ యార్డుకు తీసుకువచ్చామని, అయితే అప్పుడు ధాన్యంలో తేమశాతం ఎక్కువగా ఉందని కాంటా వేయలేదన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు.

  • ‘నాణ్యమైన విద్య అందించాలి’

    నాగర్‌కర్నూల్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అడ్మిషన్లు, మౌలిక వసతులు, సిబ్బంది సమస్యలపై చర్చించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటామని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని బాలకిష్టారెడ్డి హామీ ఇచ్చారు.

     

  • ఏకగ్రీవంగా బీజేపీ మండల కమిటీ ఎన్నిక

    నాగర్ కర్నూల్: జిల్లా బీజేపీ కార్యాలయంలో వేముల నరేందర్ రావు సమక్షంలో 45 మందితో నాగర్ కర్నూల్ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రోడ్లు, డ్రైనేజీ, ఆసుపత్రి, విద్యుత్ సమస్యలపై చర్చించారు. అనంతరం ఆపరేషన్ సింధూర్ విజయానికి మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

  • నూతన మంత్రిని సన్మానించిన ఎమ్మెల్యే

    నాగర్ కర్నూల్: నూతనంగా నియమితులైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం మంత్రిగా నియమితులైన లక్ష్మణ్ కుమార్‌ను ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

  • లొట్టలేసుకుంటూ తింటున్నారా?

    మహబూబ్‌నగర్: ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లు,రెస్టారెంట్లు, బార్లు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. దీంతో అనారోగ్య సమస్యలు పెరిగి ఆరోగ్యానికి, పర్సుకు చిల్లు పడే ప్రమాదం ఉంది. తాజాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ రెస్టారెంట్‌లో నిల్వ ఉంచిన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్రిజ్‌లో నుంచి ఆమాంసాన్ని తీయగానే దుర్వాసన రావడంతో వెంటనే పారేశారు. దీంతో ప్రజల్లో మరింత ఆందోళన పెరుగుతోంది.

  • బడుల్లో తీరనున్న ఉపాధ్యాయుల కొరత

    మహబూబ్‌నగర్: గతేడాది ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్ణంతో పాటు డీఎస్సీ ద్వారా కొత్త ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కొందరు ఉద్యోగ విరమణ చేయడంతో సర్దుబాటు చేసేందుకు ఇప్పటికే ఖాళీల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోందని. మెరుగైన బోధన చేసేలా ఉపాధ్యాయులందరికీ వేసవిలో ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చారు. దీంతో సర్కారు బడుల్లో ఉపాధ్యాయుల కొరత తీరనున్నాయి.