Locations: నాగర్ కర్నూల్

  • చర్చలే నిజమయ్యాయి..!

    నారాయణపేట: అంతా చర్చించుకున్నదే నిజమైంది. మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరికి క్రీడల శాఖను కేటాయించారు. క్రీడాకారుడైన వాకాటికి క్రీడల మంత్రిత్వ శాఖ వస్తుందని మొదటి నుంచే జిల్లాలో కాంగ్రెస్ నాయకులు చర్చించుకున్నారు. గతంలోనూ క్రీడల శాఖమంత్రిగా పని చేసిన రాములు, శ్రీనివాస్ గౌడ్ జిల్లా వాసులే కావడం విశేషం. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో క్రీడలకు మంచి భవిష్యత్ లభిస్తుందని క్రీడాకారులు ఆశిస్తున్నారు.

  • మద్యం తాగే వారికి ఎస్ఐ హెచ్చరిక

    నాగర్ కర్నూల్: పద్మనపల్లి వ్యవసాయ పొలాల్లో మద్యం తాగి సీసాలు పగులగొడుతున్న యువకులపై రైతు శ్రీకాంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు లింగాల ఎస్ఐ వెంకటేశ్వర్ గౌడ్ తనిఖీ చేశారు. మద్యం సీసాల వల్ల రైతులకు, పశువులకు గాయాలవుతున్నాయని, పొలాల్లో మద్యం తాగేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, 100కి కాల్ చేయాలని ఆయన సూచించారు.

  • రేషన్‌కు బారులు

    నాగర్ కర్నూల్: ఈ నెల చివరి వరకు రేషన్ బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ రేషన్ షాపుల వద్ద ప్రజల క్యూ లైన్లు తగ్గడం లేదు. మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం ఈ నెలలో పంపిణీ చేస్తున్నడంతో కల్వకుర్తిలోని ప్రతి రేషన్ దుకాణం వద్ద ప్రజలు బారులు తీరి కనిపిస్తున్నారు.

  • లారీని ఢీకొట్టిన బస్సు.. 18 మందికి తీవ్ర గాయాలు

    TG: నారాయణపేట జిల్లా మక్తల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొందలకుంట దగ్గర ఆగి ఉన్న లారీని కర్ణాటకకు చెందిన దుర్గాంబ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కర్ణాటకలోకి శివమొగ్గ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

  • ‘పెండింగ్ బిల్లులు చెల్లించాలి’

    నాగర్‌కర్నూల్: జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు చెల్లించి, కనీస వేతనం రూ.18,000 అమలు చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పొదిల రామయ్య డిమాండ్ చేశారు. రూ.3000 వేతనంతో, రూ. 6-10 బడ్జెట్‌తో పౌష్టికాహారం అందించడం అసాధ్యమన్నారు. అదనపు వంటకు అదనపు బిల్లులు చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

  • జూన్ 14న జాతీయ లోక్ అదాలత్

    నాగర్‌కర్నూల్‌: జూన్ 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ గురించి జిల్లా కోర్టు ప్రాంగణంలో సమావేశంలో నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ నసీం సుల్తానా మాట్లాడుతూ.. రాజీపడదగిన క్రిమినల్, చెక్ బౌన్స్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఎక్సైజ్, ఎలక్ట్రిసిటీ కేసులను పరిష్కరించాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా సమయం, ఖర్చు ఆదా అవుతాయని, సివిల్ కేసులనూ పరిష్కరించుకోవచ్చని ఆమె తెలిపారు.

     

  • ‘నవంబర్‌లోగా నిర్మాణాలు పూర్తిచేయాలి’

    నాగర్‌కర్నూల్‌: జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను కలెక్టర్ బాదావత్ సంతోష్ పరిశీలించారు. నవంబర్‌లోగా నిర్మాణం పూర్తి చేయాలని, పనుల్లో వేగం పెంచాలని పంచాయతీరాజ్ ఇంజనీర్లను ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల పెట్రోల్ పంపు స్థల సేకరణ, పోలీస్ పరేడ్ మైదాన నిర్మాణ పనులను కూడా కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

     

  • ‘బస్ పాస్ ధరలను తగ్గించాలి’

    నాగర్‌కర్నూల్: పెంచిన విద్యార్థుల బస్ పాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ ప్రసాద్ డిపో సూపర్‌డెంట్  కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. 200 శాతం ధరల పెంపు దుర్మార్గమని, ఉచిత బస్సు హామీ నష్టాన్ని విద్యార్థులపై మోపుతున్నారని విమర్శించారు. పాత ధరలనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు.

     

  • క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలు

    నాగర్‌కర్నూల్: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. బుధవారం ప్రవేశాల పోస్టర్లను కలెక్టర్ బదావత్ సంతోష్ ఆవిష్కరించారు. జూన్ 24న నాగర్‌కర్నూల్‌లో జిల్లా స్థాయి ఎంపికలు జరిగాక, జూలై 1-5 వరకు రాష్ట్రస్థాయి ఎంపికలు ఉంటాయి. హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్‌లలో ఒక్కో కేంద్రంలో బాలురు, బాలికలకు 20 చొప్పున మొత్తం 120 సీట్లకు ఈ ఎంపికలు జరుగుతాయి.

  • ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్

    నాగర్‌కర్నూల్: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన డి. రమాకాంత్‌ను బుధవారం కలెక్టర్ బాదావత్ సంతోష్ కలిశారు. అనంతరం జిల్లా స్థితిగతులపై చర్చించారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.