Locations: నాగర్ కర్నూల్

  • ఉపాధి హామీ పథకంలో పొలంబాట పనులు

    నాగర్ కర్నూల్: పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్లలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పొలంబాట పనులను టెక్నికల్ అసిస్టెంట్ మణిరామ్ తనిఖీ చేశారు. గ్రామంలోని రైతులకు తమ పొలాలకు వెళ్లడానికి ఇబ్బందులు లేకుండా ఉపాధి హామీ పథకంలో పొలంబాట పనులు చేపడతారని తెలిపారు. ఈ పనులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

  • ‘ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది’

    నాగర్ కర్నూల్: ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సీపీఎం నాయకుడు ఈశ్వర్ అన్నారు. పెంట్లవెల్లి మండల తాహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ జయసింహకు అందజేశారు.

  • 5 వాహనాలకు వేలం.. ధర ఎంతో తెలుసా?

    నాగర్ కర్నూల్: కొల్లాపూర్ ఎక్సైజ్ స్టేషన్‌లో పట్టుబడిన 5 ద్విచక్ర వాహనాలను జిల్లా ఎక్సైజ్ అధికారిణి గాయత్రి సమక్షంలో వేలం వేశారు. ప్రభుత్వం రూ. 22,000 నిర్ణయించగా, వేలంలో రూ. 35,600 (61.8% అధికం) మరియు రూ. 4,272 జీఎస్టీ లభించాయని ఎక్సైజ్ అధికారిణి గాయత్రి తెలిపారు.

  • నిధుల కోసం ధర్నా

    నాగర్ కర్నూల్: రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు, మండల కార్యదర్శి పొదిలి రామయ్య, జిల్లా నాయకులు యాదయ్య, మధు వెంకటేష్, శివరాం, కుర్మయ్య ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

  • నాటుకోళ్లకు భారీ డిమాండ్ @ రూ.1200

    జోగులాంబ గద్వాల: ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాటుకోళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. కిలో నాటుకోడి ధర రూ. 1000 నుంచి 1200 పలుకుతోంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో సుంకులమ్మకు కోళ్లను బలిచ్చే ఆచారం ఉండటంతో, ప్రజలు అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు.

  • నిచ్చెనగట్టుపై చిరుత.. ఆందోళనలో జనం

    మహబూబ్‌నగర్: మరికల్ మండలం పూసలపాడు గ్రామం సంజీవ కొండ సమీపంలోని నిచ్చెనగట్టుపై చిరుత సంచరించింది. గతంలోనూ ఈ గట్టుపై చిరుత పశువులను వేటాడి చంపిన‌ట్లు గ్రామస్తులు తెలిపారు. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళన గురవుతున్నారు. అట‌వీశాఖ అధికారులు స్పందించి చిరుత భారీ నుంచి రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బీట్ అధికారి మల్లేష్‌ను వివరణ కోరగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు.

  • నల్లమలలో చిరుత కనువిందు

    నాగర్ కర్నూల్: నల్లమల అటవీ ప్రాంతంలో పర్యాటకులకు చిరుతపులి కనువిందు చేసింది. ఫరాబాద్ చౌరస్తా నుంచి కొందరు పర్యాటకులు సాయంత్రం సందర్శనకు వెళ్తుండగా మార్గమధ్యలో నిజాంకాలం నాడు నిర్మించిన శికార్ ఘర్ సమీపంలో చిరుత రోడ్డు పైకి వచ్చింది. పర్యాటకులు ఆ దృశ్యాన్ని తమ ఫోన్లలో బంధించారు. వారం వ్యవధిలో చిరుత కనిపించటం ఇది రెండోసారని అటవీ అధికారులు విషయం ధ్రువీకరించారు.

  • పండుగకు సర్వం సన్నద్ధం

    మహబూబ్‌నగర్: ఏరువాక పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలు సన్నద్ధం అవుతున్నారు. దీంతో జిల్లా కేంద్రంతోపాటు గ్రామ ప్రజలు, రైతులతో కళకళాలాడుతూ కనిపించాయి. ఉత్సవాలకు సంబంధించిన వాటిని కొనుగోళ్లు చేయడంలో నిమగ్నం అయ్యారు. గ్రామ దేవతలకు సమర్పించేందుకు సంత రోజు కాకపోయిన కోళ్ల కొనుగోళ్లు కూడా జోరుగా సాగింది. అలాగే గ్రామ దేవతలైన సుంకులమ్మ, ఈదమ్మ అమ్మవార్ల ఆలయాలను ముస్తాబు చేశారు.

  • కొమ్మినేని అరెస్టు దుర్మార్గమైన చర్య

    నాగర్‌కర్నూల్‌: జిల్లాలో సీనియర్‌ జర్నలిస్టులు కందికొండ మోహన్, పాదం వెంకటేశ్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏపీ ప్రభుత్వం సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుపై అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపడం అప్రజాస్వామికమని ఖండించారు. 50 ఏళ్ల అనుభవం ఉన్న కొమ్మినేని అరెస్టును దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.

     

     

  • సత్యనారాయణ స్వామి వ్రతాలు


    నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీ రామాలయంలో ఈనెల 11న బుధవారం ఉదయం 11 గంటలకు సామూహిక శ్రీరామా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి. అనంతరం వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాద వితరణ ఉంటుందని ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ తెలిపారు. భక్తులు పాల్గొని స్వామివారి కృప పొందాలని కోరారు.