Locations: నాగర్ కర్నూల్

  • ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందజేత

    నాగర్‌కర్నూల్: ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో నాగర్‌కర్నూల్ మండలానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. గత పాలకులు పేదల సమస్యలు పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం పేదల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని చెప్పారు. ఎన్నికల హామీ మేరకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

     

  • ‘హింసతో ఏదీ సాధించలేరు’

    నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సంగనమౌని బంగారు బాబు మాట్లాడుతూ.. మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో హింసతో ఏదీ సాధించలేరని, మావోయిజంతో నక్సలైట్లు సాధించింది శూన్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేలో భారత్ జిల్లా కన్వీనర్ రమేష్, జిల్లా సోషల్ మీడియా ఇన్‌ఛార్జి ప్రసాద్‌కుమార్ పాల్గొన్నారు.

     

  • ‘ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలి’

    నాగర్‌కర్నూల్: కలెక్టర్ బాదావత్ సంతోష్ మంగళవారం తెల్కపల్లి ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నమోదును పెంచడానికి ఇంటింటి ప్రచారం నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు ఉంటాయని తల్లిదండ్రులకు వివరించారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలని కలెక్టర్ పేర్కొన్నారు.

     

  • రేషన్ దుకాణంలో కలెక్టర్ తనిఖీలు

    నాగర్‌కర్నూల్: కలెక్టర్ బాదావత్ సంతోష్ మంగళవారం తెల్కపల్లి మండలం రాకొండలోని రేషన్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సన్నబియ్యం పంపిణీ, కొత్త ఈ-పాస్ సాఫ్ట్‌వేర్ పనితీరును పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా, బియ్యం సరఫరాలో లోపాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

     

  • ‘కొడంగల్ సీఎంలా వ్యవహరిస్తున్నారు’

    నాగర్‌కర్నూల్: జిల్లాలో ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ సూట్ కేసులు మోసే ప్రభుత్వం కాదని, మాటమీద నిలబడే ప్రభుత్వమన్నారు. ట్రిపుల్ తలాక్ రద్దు, వక్ఫ్ బోర్డు సంక్షేమ చట్టం వంటి అంశాలను ప్రస్తావించారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తూ, రాష్ట్రాన్ని వదిలి కొడంగల్ అభివృద్ధికి రూ.5,600కోట్లు కేటాయించడంపై మండిపడ్డారు.

  • రేషన్ గడువు పొడిగింపు

    నాగర్‌కర్నూల్: జూన్ నెలలో మూడు నెలల సన్నబియ్యం ఒకేసారి పంపిణీ చేస్తుండగా, రేషన్ తీసుకునే గడువు జూన్ 30 వరకు పొడిగించిన్నట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని  సూచించారు. ఇప్పటికే జిల్లాలోని 425 రేషన్ షాపులకు బియ్యం పంపిణీ చేశామని పేర్కొన్నారు.

     

  • లట్టుపల్లిలో రెవెన్యూ సదస్సు

    నాగర్‌కర్నూల్: బిజినపల్లి మండలం లట్టుపల్లి రైతువేదిక వద్ద మంగళవారం భూ భారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మునురుద్దీన్ 41 ఫిర్యాదులు స్వీకరించారు. రైతులు భూ సంబంధిత ఫిర్యాదులను స్వయంగా వచ్చి, దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువపత్రాల నకళ్లు జతపరచాలని తహసీల్దర్ సూచించారు. కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.

     

  • ‘పెంచిన ఛార్జీలు తగ్గించాలి’

    నాగర్‌కర్నూల్: ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ బస్సు, బస్సు పాస్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డీవైఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి నాగపూర్ మధు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో మంగళవారం నిరసన చేపట్టారు. 20% ఛార్జీల పెంపుతో సామాన్య ప్రజలు, విద్యార్థులపై భారం పడుతుందని, ఇది విద్యకు దూరం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మహాలక్ష్మి పథకం అంటూనే ఛార్జీలు పెంచడం సరికాదని మండిపడ్డారు.

  • ‘పాఠశాలలన్నీ పరిశుభ్రంగా ఉండాలి’

    నాగర్‌కర్నూల్: తిమ్మాజిపేట మండలంలోని ప్ర‌భుత్వ‌ పాఠశాలల పరిశుభ్రత పారిశుధ్యంపై మంగళవారం మండల స్థాయిలో ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కేజీబీవీ పాఠశాలలో జరిగిన శిక్షణ కార్యక్రమానికి తిమ్మాజీపేట ఎంఈఓ సత్యనారాయణ శెట్టి హాజరై మాట్లాడారు. పాఠశాలల‌ను తెరిచేనాటికి పాఠశాలలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలన్నారు. తరగతి గదులతో పాటు మరుగుదొడ్లు, నీటి ట్యాంకులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేటట్లు చూడాలన్నారు.

     

  • ‘పున‌రావాస ప‌నుల‌ను వేగ‌వంతం చేయాలి’

    నాగర్‌కర్నూల్: పాల‌మూరు-రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కంలో భాగంగా చేప‌ట్టిన నార్ల‌పూర్ రిజ‌ర్వాయ‌ర్ నిర్వాసితుల పున‌రావాస ప‌నుల‌ను వేగ‌వంతం చేయాలని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అధికారుల‌ను ఆదేశించారు. సోమ‌వారం డా.బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో నీటిపారుద‌ల‌, ఆర్&ఆర్ అధికారుల‌తో మంత్రి జూప‌ల్లి స‌మీక్ష నిర్వ‌హించారు. నార్లాపూర్ గ్రామాల నిర్వాసితుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించిన‌ప్ప‌టికీ వారికి ప‌రిహారం చెల్లించ‌లేదని, ప‌రిహారం చెల్లించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.