Locations: నాగర్ కర్నూల్

  • ‘రైతులు ఆర్థికంగా ఎదగాలి’

    నాగర్‌కర్నూల్: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి మండలంలోని 41 మంది రైతు లబ్ధిదారులకు స్ప్రింక్లర్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. రైతులు స్ప్రింక్లర్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమణ రావు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

     

  • ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్‌న్యూస్

    • బొడ్రాయి పండుగలో డ్రైవర్ శ్రీను మృతి
    • చిన్న చింతకుంటలో వృద్ధురాలు మృతి
    • మక్తల్‌లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం
    • రెవెన్యూ సదస్సును పరిశీలించిన కలెక్టర్ బాదావత్ సంతోష్

  • రెడ్‌క్రాస్ సొసైటీ సమావేశం

    నాగర్‌కర్నూల్: రెడ్ క్రాస్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఈ నెల 27న జిల్లా కేంద్రంలోని సమావేశ మందిరంలో జరుగుతుంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ సమావేశానికి శాశ్వత సభ్యులు, ప్యాట్రన్, వైస్ ప్యాట్రన్, లైఫ్ అసోసియేట్ సభ్యులందరూ హాజరు కావాలని జిల్లా కార్యదర్శి రమేష్ రెడ్డి తెలిపారు. రెడ్ క్రాస్ కార్యక్రమాలపై చర్చించి, అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.

  • రైస్ మిల్లును తనిఖీ చేసిన కలెక్టర్

    మహబూబ్‌నగర్: కల్వకుర్తిలోని శ్రీ సద్గురు రాఘవేంద్ర పారాబైల్డ్ రైస్ మిల్లును గురువారంకలెక్టర్ బాదావత్ సంతోష్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మిగిలిన ధాన్యాన్ని సకాలంలో దిగుమతి చేసుకుని పూర్తిస్థాయిలో మిల్లింగ్ ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు. మిల్లింగ్ చేసిన బియ్యాన్ని జాగ్రత్తగా భద్రపరచాలని, ధాన్యం నిల్వల దిగుమతిలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను సూచించారు.

  • బొడ్రాయి పండుగ.. వ్యక్తి మృతి

    వనపర్తి: ఆత్మకూరులో బొడ్రాయి పండుగకు వచ్చి మహేష్(35) అనే వ్యక్తి గురువారం ఆకస్మికంగా కుప్పకూలిపోయి మృతిచెందాడు. రాయగడ్డకు చెందిన ఇతను ఆత్మకూరులోని బంధువుల ఇంటికి వచ్చాడు. ఆసుపత్రికి తరలించగా వైద్యులు మరణించినట్లు ధృవీకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

  • బాల్య వివాహం అడ్డగింత

    నారాయణపేట: మాగనూరు మండల కేంద్రంలో ఓ గ్రామానికి చెందిన యువకుడికి బాలికతో వివాహం చేస్తున్నారని సమాచారం అందుకున్న బాలల హక్కుల పరిరక్షణ కమిటీ స్థానిక పోలీసుల సహాయంతో వివాహాన్ని అడ్డుకున్నారు. అనంతరం బాలికను జిల్లా బాలసదనానికి తరలించారు. ఈ సందర్భంగా కమిటీ కౌన్సిలర్ వింధ్యారాణి మాట్లాడుతూ.. ఎక్కడైనా బాల్యవివాహాల సమాచారం తెలిస్తే వెంటనే 1098 నంబర్‌కు ఫోన్ చేయాలని తెలిపారు.

  • రూ.లక్ష చోరీ.. కేసు నమోదు

    నారాయణపేట: మాగనూరు మండలం మందిపల్ గ్రామానికి చెందిన కురువ నాగప్ప వడ్లు అమ్మిన డబ్బులను మక్తల్ యూనియన్ బ్యాంకులో తీసుకున్నాడు. అనంతరం రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వ్యక్తి నాగప్ప మెడపైన ద్రావణం చల్లాడు. శుభ్రం చేసుకుందామని డబ్బు సంచి పక్కనపెట్టి చేతులు కడుగుతుండగా రూ.లక్షను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేయగా కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి తెలిపారు.

  • తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి

    నాగర్ కర్నూల్: తాటి చెట్టు పైనుంచి కిందపడి గీత కార్మికుడు మృతి చెందిన విషాద ఘటన తాడూరు మండలం సిర్సవాడ గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. చింతకింది మల్లేష్(35) రోజువారి మాదిరిగానే గురువారం ఉదయం తాటిచెట్టు ఎక్కి కల్లు తీస్తున్నాడు. ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన మృతితో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

  • ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్‌న్యూస్

    • మిడ్జిల్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు
    • బాలానగర్‌లో వృద్ధురాలి అదృశ్యం
    • పాన్‌గల్‌లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత
    • ముడుమాలలో నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

  • వృద్ధురాలి అదృశ్యం

    మహబూబ్‌నగర్: బాలానగర్‌లోని కోయిలకొండ గ్రామానికి చెందిన వెంకటమ్మ(60) అనే వృద్ధురాలు అదృశ్యమైంది. జీవనోపాధి కోసం కేతిరెడ్డిపల్లిలో నివాసముంటూ మామిడితోటలో పనిచేస్తోంది. మే 17న మామిడితోట నుంచి బయటికి వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఆమె కుమారుడు కృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై లెనిన్ తెలిపారు.