- మాగనూరు నూతన తహసీల్దార్‌గా నాగలక్ష్మి
- చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి
- నవోదయ ప్రవేశాలకు జులై 29వరకు దరఖాస్తులు చేసుకోవాలి
- అచ్చంపేట మార్కెట్‌లో ధరలు ఇలా..
Locations: నాగర్ కర్నూల్
-
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్‌న్యూస్
-
బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి
నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండంకి చెందిన వనజ అనే ఎస్టీ కులానికి చెందిన మహిళ కాన్పు కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చింది. వైద్యులు ఆపరేషన్ చేసిన తర్వాత మరణించింది. ఈ ఘటనపై కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అంతటికాశన్న, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు అశోక్ బాధిత కుటుంబసభ్యులతో కలిసి ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.
-
అచ్చంపేట మార్కెట్‌లో ధరలు ఇలా..
నాగర్‌కర్నూల్ : అచ్చంపేట డివిజన్‌లోని వివిధ గ్రామాల రైతులు మంగళవారం 48 క్వింటాళ్ల (192 బస్తాలు) వేరుసెనగ అమ్మకానికి మార్కెట్‌కు తీసుకొచ్చారు. క్వింటా గరిష్ట ధర రూ. 6,636 మాదిరి ధర రూ.6,635, కనిష్ఠ ధర 3,020లు మర్కెట్ ధర పలికింది. మొక్కజొన్న 374.50క్వింటాళ్లు అమ్మకానికి తీసుకొని రాగా క్వింటా గరిష్టధర రూ.2,212 మాదిరి ధర రూ.2,211 కనిష్ఠ ధర రూ.1,600లకు రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేశారు.
-
జులై 29వరకు దరఖాస్తులు చేసుకోవాలి
నాగర్‌కర్నూల్: బిజినేపల్లి మండలం వట్టెంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ భాస్కర్‌కుమార్ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు జులై 29వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు నవోదయ విద్యాలయ వెబ్ సైట్‌ను చూడాలన్నారు.
-
అనుమానాస్పద స్థితిలో టీచర్ మృతి
నారాయణపేట: దామరగిద్ద ప్రైమరీ స్కూల్ హెచ్.ఎం అలివేలుమంగ(46) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. అపస్మారక స్థితిలో ఇంటిలో పడి ఉన్న ఆమెను, భర్త ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి అన్న రమణ అనుమానంతో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
అక్రమంగా తరలిస్తున్న 70 గోవులు పట్టివేత
జోగులాంబ గద్వాల: ఉండవెల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న 70కి పైగా ఆవులు, ఎద్దులను పోలీసులు పట్టుకున్నారు. బక్రీద్ సందర్భంగా ఈ వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గోవులను మానవపాడు ఉన్నత పాఠశాలలో వదిలినట్లు, ఆసక్తిగల రైతులు సంరక్షిస్తే వారికి అప్పగిస్తామని వైద్యాధికారులు పేర్కొన్నారు.
-
వామ్మో.. వీధిలో మొసలి
జోగులాంబగద్వాల: జిల్లా కేంద్రంలోని హమాలీ కాలనీలో సోమవారం అర్థరాత్రి మొసలి కలకలం రేపింది. అక్కడున్న కుక్కలు పెద్ద ఎత్తున అరిచాయి. దీంతో గమనించిన కాలనీవాసులు మొసలిని చూసి చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్న కాలనీవాసులతో కలిసి దానిని తాళ్లతో బంధించారు. అటవీశాఖ అధికారులు వచ్చి మొసలిని తీసుకెళ్లాలని కాలనీవాసులు కోరుతున్నారు.
-
జూరాలకు కొనసాగుతున్న వరద ప్రవాహం
వనపర్తి: జూరాల జలాశయంలోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. 24వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. జలాశయంలో నీటినిల్వ 8.697 టీఎంసీలుగా ఉంది. నీటినిల్వ గరిష్ఠ స్థాయికి చేరువలో ఉండటంతో జలవిద్యుదుత్పత్తికి 27వేల క్యూసెక్కులు వదులుతున్నారు. నెట్టెంపాడు లిఫ్టు 750 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కర్ణాటకలోని ఆలమట్టి ప్రాజెక్టులోకి వరద ప్రవాహం తగ్గింది. 17వేల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోందని అధికారులు వెల్లడించారు.