Locations: నాగర్ కర్నూల్

  • ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్‌న్యూస్

    • బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ బాదావత్ సంతోష్
    • బిజినపల్లిలో సమగ్ర వ్యాధి నిర్ధారణ ఆరోగ్య పరీక్షల శిబిరం
    • భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సును సదర్శించిన కలెక్టర్ ఆదర్శ్ సురభి
    • ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు: డిఈవో రమేష్ కుమార్

  • ఆ విషయంలో ఎంపీ రవి.. పార్టీ లైన్ దాటారు: సంపత్ కుమార్

    TG: నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవిపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు అలంపూర్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై AICC కార్యదర్శి సంపత్ కుమార్ స్పందించారు. ‘‘ఎంపీ మల్లు రవి అంటే మాకు గౌరవం ఉంది. BRS ఎమ్మెల్యే విజయుడును మా వాడే అనడం పార్టీ లైన్ దాటినట్లే అవుతుంది’’అని అన్నారు.

  • ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

    నాగర్‌కర్నూల్: పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏఎస్‌వో లత తెలిపారు. కంప్యూటర్ సైన్స్, ఎంపీఏడబ్ల్యూ కోర్సుల కోసం పదో తరగతి పూర్తయిన బాలికలు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఆరో తరగతిలో ఖాళీ ఉన్న సీట్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

  • ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్

    నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ బాదావత్ సంతోష్ పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్‌ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్‌లు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈవీఎంల భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు రవికుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

  • మందుబాబులకు జరిమానా

    నాగర్‌కర్నూల్: ఊర్కొండలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ముగ్గురు పట్టుబడినట్లు ఎస్సై కృష్ణదేవ తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా ఒకరికి ఒకరోజు జైలు శిక్ష, మరో ఇద్దరికి రు.1500 చొప్పున జరిమానా విధించారని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రాణాలు పోగొట్టుకోవద్దని సూచించారు.

  • ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా టాప్‌న్యూస్

    • తెలకపల్లి మండలంలో పురుగుమందు తాగి వివాహిత ఆత్మహత్య
    • నేడు మహబూబ్‌నగర్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాక
    • కందనూలు మండలంలో బాలిక అదృశ్యంపై కేసు నమోదు
    • నాగర్‌కర్నూల్‌లో 9న ఉచిత కంటి వైద్యశిబిరం

  • పురుగుమందు తాగి వివాహిత ఆత్మహత్య

    మహబూబ్‌నగర్: పురుగుమందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలకపల్లి మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై బి.నరేష్ వివరాల ప్రకారం.. రామ్‌రెడ్డిపల్లి గ్రామానికి చెందిన గెంటిల స్వప్న(38) భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదం జరిగింది. దీంతో మనస్థాపానికి గురైన స్వప్న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

     

  • బాలిక అదృశ్యంపై కేసు నమోదు

    నాగర్‌కర్నూల్: కందనూలు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు. గురువారం తెల్లవారజాము నుంచి కనిపించడం లేదని బాలిక తండ్రి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఎవరికైనా తెలిస్తే స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలని కోరారు.

     

  • నేడు జిల్లాకు డిప్యూటీ సీఎం రాక

    మహబూబ్‌నగర్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం జిల్లాలో పర్యటించను న్నారు. మూసాపేట, నవాబ్‌పేట మండలాల్లో విద్యుత్ ఉపకేంద్రాల ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా మండలకేంద్రాల్లో సభలు నిర్వహించనున్నారు. మూసాపేటలో సభా ఏర్పాట్లను కలెక్టర్ విజయేందిర బోయి, నవాబ్‌పేటలో ఏర్పాట్లను అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ పరిశీలించారు. ప్రజలకు తగిన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

  • 9న ఉచిత కంటి వైద్యశిబిరం

    నాగర్‌కర్నూల్: అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీ రామకృష్ణ టాకీస్ రోడ్డులోని శోభ ఆప్టికల్‌లో ఈనెల 9న ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహిస్తున్నట్లు రిటైర్డ్ ఆప్తాలమిక్ ఆఫీసర్ బి.శివారెడ్డి తెలిపారు. ఈ శిబిరంలో రోగులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 94404 54284, 81063 33324 నంబర్లలో సంప్రదించాలని కోరారు.