Locations: నాగర్ కర్నూల్

  • ‘ఉపాధ్యాయులు భావితరాలకు మార్గదర్శకులు’

    నాగర్‌కర్నూల్: ఉద్యోగుల పదవి విరమణ మరుపురాని ఘట్టమని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు భావితరాలకు మార్గదర్శకత్వం చేసే గురువులని ప్రశంసించారు. అచ్చంపేట పట్టణంలోని బీకే ప్యాలెస్ ఫంక్షన్ హాల్‌లో కెమిస్ట్రీ లెక్చరర్ రామకృష్ణ పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రామకృష్ణ కేవలం ఒక ఉపాధ్యాయుడు మాత్రమే కాదని, తరతరాలకు ఆదర్శప్రాయులైన మార్గదర్శకుడని కొనియాడారు.

  • ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్‌న్యూస్

    • జడ్చర్లలో కరెంట్ షాక్‌తో బాలుడు మృతి
    • పెద్దమందడి మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
    • రాజోలి మండలంలో ఉద్రిక్తత.. ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ ప్రజల నిరసన
    • నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో పోగొట్టుకున్న 100మొబైల్ ఫోన్‌‌లను బాధితులకు అందజేసిన ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్

     

  • పకడ్బందీగా బడిబాట కార్యక్రమం

    నాగర్ కర్నూల్: బడి ఈడు పిల్లలను పాఠశాలలో ఉంచే లక్ష్యంతో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 6 నుంచి 19 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల సౌకర్యాలను వివరిస్తూ, ప్రజలను భాగస్వాములను చేస్తామని డీఈవో సూచించారు.
  • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..

    నాగర్ కర్నూల్: జంతువులు, పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా, రాష్ట్ర సరిహద్దుల్లో ఆరు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపారు. 24×7 పర్యవేక్షణ కోసం పోలీసు, పశుసంవర్ధక శాఖ సిబ్బంది షిఫ్ట్‌ల వారీగా సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అక్రమ రవాణా, గోవధ విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

  • పోగొట్టుకున్న 100 మొబైల్ ఫోన్‌‌లు అందజేత

    నాగర్ కర్నూల్: జిల్లా పరిధిలోని 20 మండలాల్లో పోగొట్టుకున్న 100 మొబైల్ ఫోన్‌లను ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ బాధితులకు అందజేశారు. కొల్లాపూర్ చౌరస్తాలోని ఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్ మిస్ అయితే వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసుల సమర్థవంతమైన చర్యలను ఆయన వివరించారు. బాధితులకు ఫోన్‌లు తిరిగి అందినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
  • కరెంట్ షాక్‌తో బాలుడు మృతి

    మహబూబ్‌నగర్: జడ్చర్లలో సరస్వతి కాలనీ 3వ వార్డులో కాంగ్రెస్ నాయకుడు బొక్క రాఘవేందర్ కుమారుడు శ్రేయన్స్(10) కంచె లేని ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకి కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. గతంలో ఇదే ట్రాన్స్‌ఫార్మర్‌ వల్ల ఆవు చనిపోయినా, అధికారులు, కౌన్సిలర్ కంచె  నిర్మించకపోవడంతో ఈ ఘటన జరిగిందని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో శ్రేయన్స్ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
  • అమ్మాయిల జీవితాన్ని వెలుగులు నింపడమే లక్ష్యం

    నాగర్‌కర్నూల్: ప్రతి అమ్మాయి జీవితాన్ని వెలుగులు నింపేలా చేయడమే ప్రజాప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో తాడూరు, తెల్కపల్లి మండలాలకు సంబంధించిన 96కుటుంబాలకి కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. పేదకుటుంబాల్లో అమ్మాయిల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఈ పథకాలను అందించే బాధ్యత అధికారులకే ఉందన్నారు.

     

  • తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

    వనపర్తి: తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన పెద్దమందడి మండలంలో చోటుచేసుకుంది. మోజర్లకి చెందిన వీరేశ్ హైదరాబాద్‌కి జీవనోపాధి కోసం కుటుంబసభ్యులతో వలస వెళ్లి మేస్ట్రీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాన్ని పగలగొట్టి బంగారం, వెండిని చోరీ చేశారు. బాధితుగు ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు.

  • ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్‌న్యూస్

    • మాగనూరు నూతన తహసీల్దార్‌గా నాగలక్ష్మి
    • చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి
    • నవోదయ ప్రవేశాలకు జులై 29వరకు దరఖాస్తులు చేసుకోవాలి
    • అచ్చంపేట మార్కెట్‌లో ధరలు ఇలా..

  • బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి

    నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండంకి చెందిన వనజ అనే ఎస్టీ కులానికి చెందిన మహిళ కాన్పు కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చింది. వైద్యులు ఆపరేషన్ చేసిన తర్వాత మరణించింది. ఈ ఘటనపై కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అంతటికాశన్న, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు అశోక్ బాధిత కుటుంబసభ్యులతో కలిసి ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.