Locations: నాగర్ కర్నూల్

  • ‘విద్యారంగ సమస్యలను విస్మరించారు’

    నాగర్‌కర్నూల్‌: ఏబీవీపీ విద్యారంగ సమస్యలపై సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించింది. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగారు బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలు ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి విద్యారంగ సమస్యలను విస్మరించారని మండిపడ్డారు.

     

  • ప్రత్యేక బోటు ప్రారంభం

    నాగర్‌కర్నూల్: కలెక్టర్ బడావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ సోమవారం రఘునాథ్ కలిసి ట్యాంక్ బండ్ పై ప్రత్యేక బోటును ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో, అనుమానాస్పద వ్యక్తులు లేదా నీటిలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఈ బోటు ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమానికి ఆర్ఐ జగన్, ఆర్ఎస్ఐ గౌస్ పాషాతో పాటు మీడియా ప్రతినిధులు హాజరయ్యారు.

  • ‘నూతన బీటీ రోడ్డును వేయాలి’

    నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ నుంచి నల్లవెల్లి, నంది వడ్డేమాన్, అల్లిపూర్ గ్రామాలకు నూతన బీటీరోడ్డు వేయాలని బీఎస్పీ జిల్లా అసెంబ్లీ అధ్యక్షుడు నాగేష్, సీనియర్ నాయకులు శ్రీను అన్నారు. ఈమేరకు  ప్రజావాణిలో ఏవో చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఈ రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారిందన్నారు. వెంటనే పనులు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు.

  • నాసిరకం యురియా అమ్మారంటూ ఆందోళన

    నాగర్‌కర్నూల్: యూరియా కోసం కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేశారు. నాసిరకం యురియాను బ్రాండెడ్ కాంప్లెక్స్ సంచులలో వేసి ఫర్టిలైజర్ షాప్ యజమాని అమ్మినట్లు రైతులు తెలిపారు. షాపు యజమాని తమకు నాసిరికం యూరియాను ఇచ్చారంటూ కలెక్టర్ ఆఫీస్ వద్దకు ఫిర్యాదు చేయడానికి వచ్చినట్లు పేర్కొన్నారు. రైతులను షాపు యజమాని ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్నారు.

  • ముచర్లపల్లిలో పెన్షన్ సభ

    నాగర్ కర్నూల్: పెన్షన్ల పెంపు కోసం పెన్షన్ దారులు డిమాండ్ చేస్తూ ఉర్కొండ మండలం ముచర్లపల్లి గ్రామంలో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు వీరాస్వామి, రాధాకృష్ణ, కొమ్ము శ్రీను ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గత 20 నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు పెంచాలని వారు డిమాండ్ చేశారు.

  • భార్య గొంతుకోసి చంపిన భర్త

    నాగర్‌కర్నూల్‌: నల్లమల అడవుల్లో దారుణం జరిగింది. అనుమానంతో భార్య శ్రావణిని భర్త శ్రీశైలం అత్యంత దారుణంగా హత్య చేశాడు. సోమశిల వెళ్దామని నమ్మించి తీసుకెళ్లిన శ్రీశైలం, మార్గమధ్యంలో ఆమె గొంతుకోసి చంపాడు. అనంతరం మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు పోలీసులు తెలిపారు. కొంతకాలంగా వారి మధ్య విభేదాలు ఉన్నాయని వెల్లడించారు.

  • చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

    వనపర్తి: చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మృతిచెందిన సంఘటన చిన్నచింతకుంటలో చోటుచేసుకుంది. ఎస్సై రాంలాలా నాయక్ వివరాలప్రకారం.. సంఘమోని రాము (41) ఆదివారం గ్రామసమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్‌డ్యాంలో చేపల వేటకు వెళ్లి వల వేశాడు. అయితే వలను తీసే సమయంలో ప్రమాదవశాత్తు వల చుట్టుకొని చెక్‌డ్యాంలో మునిగి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు.

  • జూరాలకు కొనసాగుతున్న వరద

    జోగులాంబ గద్వాల: జూరాల జలాశయంలోకి 3.88 లక్షల క్యూసెక్కుల వరద చేరుతోంది. 41 గేట్లు ఎత్తి 3.79లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. కర్ణాటకలోని ఆలమట్టి జలాశయంలోకి 2.04లక్షల క్యూసెక్కులు చేరుతుండగా దిగువకు 2.05 లక్షలు వదులుతున్నారు. కర్ణాటక ప్రాజెక్టుల నుంచి వరద నీరు విడుదల కొనసాగుతుండడంతో జూరాలకు మరో నాలుగైదు రోజుల పాటు వరద నిలకడగా కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

  • యువతి అదృశ్యం.. కేసు నమోదు

    నాగర్‌కర్నూల్: కందనూలు పట్టణంలోని ఓ కాలనీకి చెందిన యువతి ఈనెల 20న ఇంట్లో కుటుంబ సభ్యులకు పని మీద బయటికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో పలుచోట్ల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. యువతి తల్లి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గోవర్దన్ తెలిపారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే స్థానిక పోలీస్ స్టేషన్‌‌తో తెలియజేయాలని కోరారు.

  • భార్యని చంపి కాల్చిన భర్త

    నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రంలోని కొత్త రాయవరం గ్రామానికి చెందిన శ్రీశైలం, అతని భార్య శ్రావణిని అడవిలోకి తీసుకెళ్లి చంపి, కాల్చేశాడు. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయి. సోమశిలకు వెళ్దామని మాయమాటలు చెప్పి, పెద్దకొత్తపల్లిలోని సాతాపూర్ మారేడుమాన్‌దీన్నె అడవి ప్రాంతంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.