Locations: నాగర్ కర్నూల్

  • రోడ్డు ప్రమాదంలో యువతి మృతి

    నారాయణపేట: మాగనూరు మండలం నేరడగం మఠం వద్ద రోడ్డు ప్రమాదంలో కిష్టమ్మ అనే 26 ఏళ్ల యువతి మరణించింది. దాసరి దొడ్డి గ్రామానికి చెందిన ఆమె ఆదివారం సాయంత్రం రోడ్డుపై నడుస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

  • నూతన కార్యవర్గం ఎన్నిక

    నాగర్‌కర్నూల్: జిల్లా వాలీబాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా వంకేశ్వరం నిరంజన్, ఉపాధ్యక్షుడిగా ఊరుకొండ శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా పశుల వెంకటేష్, సహాయ కార్యదర్శిగా వీరప్ప, కోశాధికారిగా పోతుల సత్యనారాయణ ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ పరిశీలకులు హనీఫ్, అధికారులు ఈ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు.

  • నాలుగు ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు

    నాగర్‌కర్నూల్: బొందలపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయంలో విద్యుత్ దీపాల లేమి సమస్యను బండారు ఆనంద్ పరిష్కరించారు. తన సొంత ఖర్చులతో గుడి ఆవరణలో సెన్సార్లతో కూడిన నాలుగు ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేశారు. చాలా కాలంగా చీకట్లో ఉన్న ఆలయంలో వెలుగులు నింపినందుకు గ్రామస్థులు, ఆలయ కమిటీ సభ్యులు ఆనంద్‌ను అభినందించారు. కార్యక్రమంలో కృష్ణారెడ్డి, బాలనాగయ్య, తిరుపతిరెడ్డి, లోకేష్‌రెడ్డి, మల్‌రెడ్డి పాల్గొన్నారు.

  • వంతెన నిర్మాణం.. గ్రామస్థుల హర్షం

    నాగర్‌కర్నూల్: తెలకపల్లి మండలం నడిగడ్డ గ్రామంలోని వాగుపై రూ.3.20 కోట్లతో వంతెన నిర్మించినందుకు గ్రామస్థులు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాలుగా వర్షాకాలంలో ఎదురైన కష్టాలకు ఈ వంతెనతో పరిష్కారం లభించింది. తమ ఎన్నో ఏళ్ల కలను నిజం చేసినందుకు గ్రామస్థులు వారి వంతెనపై పాలాభిషేకం చేసి సంతోషం వ్యక్తం చేశారు.

  • ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి

    జోగులాంబ గద్వాల: ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన కేటీదొడ్డి మండలపరిధిలోని మల్లాపురం గ్రామశివారులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలమేరకు.. రైతు కంబయ్య పొలం వద్ద ఉన్న బావిలో ఓ వ్యక్తి మృతిచెందిన విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలిపారు. దివ్యాంగుడైన మౌలాలి బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందినట్లు గుర్తించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.

  • సొంత పార్టీ నాయకులను హెచ్చరించిన ఎమ్మెల్యే

    నాగర్ కర్నూల్: ఇందిరమ్మ ఇండ్లు, కల్యాణలక్ష్మి పథకాల చెక్కుల పంపిణీలో లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్న సొంతపార్టీ నాయకులను ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి గట్టిగా హెచ్చరించారు. బిజినపల్లి మండలంలో ఇలాంటి సంఘటన తన దృష్టికిరాగా, స్వయంగా ఎస్సైతో మాట్లాడి ఎఫ్ఐఆర్ నమోదు చేయించినట్లు తెలిపారు. ఇకపై ఎవరైనా డబ్బులు డిమాండ్‌చేస్తే తనకు నేరుగా ఫిర్యాదు చేయాలని, ఎంతటి సన్నిహితులైనా వదిలిపెట్టనని స్పష్టంచేశారు.

  • ఒంటి చేత్తో జీవన పోరాటం..

    నారాయణపేట: అన్ని అవయవాలు బాగున్న కష్టపడడానికి మనసు రాని మనషులు ఉన్న ఈరోజుల్లో మాగనూరు మండలకేంద్రానికి చెందిన మహాదేవ్ (48) 20ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో తన కుడిచేతిని కోల్పోయాడు. అయినప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా స్క్రాప్ దుకాణంలో పనిచేస్తూ తన ఇద్దరు పిల్లల్ని పోషిస్తున్నాడు. వెల్డింగ్ పనులతో పాటు లోడింగ్, అన్లోడింగ్ అన్నిపనులు చేస్తానన్నాడు. బాధపడుతూ కూర్చుని పిల్లల్ని కష్టాలపాలు చేయనని ఆత్మవిశ్వాసం వ్యక్తంచేశాడు.

  • నీటి పన్ను ఆన్‌లైన్‌లో చెల్లించండి..

    నాగర్ కర్నూల్: వంద రోజుల ప్రణాళికలో భాగంగా మున్సిపల్ పరిధిలోని మిషన్ భగీరథ, మున్సిపల్ నల్ల కనెక్షన్లను ఆన్‌లైన్ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. గృహ యజమానులు తమ నీటి పన్నును నేరుగా https://cdma.cgg.gov.in ఆన్‌లైన్‌లో లేదా మున్సిపల్ కార్యాలయంలో చెల్లించవచ్చని సూచించారు.

     

  • బిజినపల్లిలో నూతన కమిటీ హాల్ ప్రారంభం

    నాగర్ కర్నూల్: బిజినపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి నూతనంగా నిర్మించిన కమిటీ హాల్, స్కూల్ కాంపౌండ్‌ను ప్రారంభించారు. అనంతరం కంటి పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమణ రావు, మండల ప్రెసిడెంట్ రాములు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • వెలగొండలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

    నాగర్ కర్నూల్: బిజినపల్లి మండలం, వెలగొండ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) భవనాలను ఎమ్మెల్యే  కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ రెండు భవనాల ప్రారంభంతో ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. వెలగొండను ఒక మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.