నాగర్‌కర్నూల్: రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత సమస్యపై ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. డీలర్లు బ్లాక్‌లో విక్రయించవద్దని, అలా చేస్తే డీలర్‌షిప్ రద్దు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి డీలర్ స్టాక్ బోర్డు ఏర్పాటు చేయాలని, ఈ-పాస్ మెషిన్లలో వివరాలు నమోదు చేయాలని సూచించారు. నానో యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు.
Locations: నాగర్ కర్నూల్
-
మెరుగైన సేవలు అందించాలి: ఎమ్మెల్యే
నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజారోగ్యంపై ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి సమీక్షించారు. మొదట గణపతికి పూజలుచేసి, మొక్కలు నాటారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వైద్య సదుపాయాలపై ఆరాతీశారు. వైద్యమంత్రి దామోదర రాజనరసింహతో మాట్లాడి పెండింగ్‌లో ఉన్న బిల్లులు, మందుల గురించి వివరించారు. రోగులపట్ల నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందిని హెచ్చరించారు. అందరూ అంకితభావంతో పనిచేసి మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
-
హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
నాగర్‌కర్నూల్: జిల్లా ఎస్పీ కార్యాలయంలో హోంగార్డు జి.దశరథం భార్య సుజాతకు ఎస్పీ రూ. 30,500 ఆర్థిక సహాయం అందించారు. అమ్రాబాద్ మండలం, బి.కె.లక్ష్మాపూర్ తండాకు చెందిన హోంగార్డు దశరథం జూన్ 29న మరణించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రాఘవరావు, ఆర్ఐ జగన్, హోంగార్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జమ్ములు తదితరులు పాల్గొన్నారు.
-
సోమశిలకు మాజీ మంత్రి తలసాని
నాగర్‌కర్నూల్: మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన కుమారుడు సాయికుమార్ యాదవ్‌లకు సోమశిలలో బీఆర్‌ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఇటీవల మరణించిన తన వియ్యంకుడు మూల రాజ్ కుమార్ గౌడ్ అస్థికలను కృష్ణా నదిలో కలిపేందుకు తలసాని అక్కడికి వచ్చారు. పూజలు నిర్వహించిన అనంతరం సంగమం వద్ద అస్థికలను గంగాజలంలో కలిపారు.
-
ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే
నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీలో వివేకానంద యూత్ ఏర్పాటు చేసిన గణపతి మండపంలో స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప దేవాలయ అర్చకులు విజయ్ శాస్త్రి పూజారి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. 25వ వార్షికోత్సవం జరుపుకుంటున్న వివేకానంద యూత్ సభ్యులను ఎమ్మెల్యే ఈసందర్భంగా అభినందించారు.
-
‘సెప్టెంబర్ 2న తుది జాబితాను విడుదల’
నాగర్‌కర్నూల్: జిల్లాలో 460 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటరు జాబితాను జిల్లా కలెక్టర్ సంతోష్ విడుదల చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి సహకరించాలని కోరారు. ఈ నెల 31 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని, సెప్టెంబర్ 2న తుది జాబితాను విడుదల చేస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొత్తం 6,47,342 ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు.
-
CMRF చెక్కుల పంపిణీ
నాగర్ కర్నూల్: పేదలకు సీఎం సహాయనిధి వరం లాంటిదని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమమే ప్రధానమని అన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
-
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బీఎస్పీ నాయకులు
నాగర్ కర్నూల్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు బీఎస్పీ జిల్లా అసెంబ్లీ నేతలు భారీగా తరలి వెళ్లారు. బీఎస్పీ తెలంగాణ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకమైన ఇబ్రాం శేఖర్ లక్నో నుంచి హైదరాబాద్‌కు రానున్న నేపథ్యంలో ర్యాలీకి బయలుదేరారు. అనంతరం రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించబోయే సమావేశానికి హాజరుకానున్నారు.
-
బ్రహ్మేశ్వరస్వామి సన్నిధిలో కర్ణాటక మంత్రి
జోగులాంబ గద్వాల: శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను కర్ణాటక రాష్ట్ర మైనర్ ఇరిగేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి ఎన్.ఎస్. బోసురాజు దంపతులు దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారికి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్ స్వాగతం పలికారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.
-
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
జోగులాంబ గద్వాల: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అలంపూర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై వెంకటస్వామి వివరాలమేరకు.. తుంగభద్ర నది అవలి సుల్తానపురం గ్రామానికి చెందిన నవీన్‌కుమార్ (26)కి భార్య స్వాతితో మూడేళ్లక్రితం వివాహమైంది. కుటుంబ వ్యవహారాలపై తండ్రి మందలించడంతో మనస్తాపంచెంది ఈనెల 17వ తేదీన పురుగుమందు తాగాడు. కుటుంబీకులు గుర్తించి ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు.