మహబూబ్‌నగర్: జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు 16 గేట్లు ఎత్తి 1,78,542 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం వైపు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 318.110 మీటర్ల నీటి సామర్థ్యం ఉంది. అప్పర్, లోయర్ జూరాల పవర్ హౌస్‌లలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.
Locations: నాగర్ కర్నూల్
-
రాకపోకలు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశాలు
నాగర్‌కర్నూల్: తెలకపల్లి మండల పరిధిలోని రామగిరి రఘుపతిపేట రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీటిని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులతో కలిసి పరిశీలించారు. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్డు మీదకు వరద నీరు చేయడంతో ప్రజల రాకపోకలను పూర్తిగా నిరోధించాలన్నారు. 24 గంటలు పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వంతెన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు.
-
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
నాగర్‌కర్నూల్: బీజినపల్లి మండల పరిధిలోని గుడ్లనర్వ, కార్కొండ, వసంతపూర్, కుమ్మెర గ్రామాలకు చెందిన ప్రజలు తమ గ్రామాలకు వెళ్లే రోడ్డుపై ఉన్న పాలెం చెరువు అలుగుపై కొత్తగా నిర్మించిన బ్రిడ్జిపై కృతజ్ఞతలు తెలిపారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
-
టీచర్‌గా మారిన కలెక్టర్!
నాగర్‌కర్నూల్: తెలకపల్లి మండలంలోని కారువంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన 9వ, 10వ తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయుడిగా మారి, గణితాన్ని సులభంగా ఎలా అర్థం చేసుకోవాలో ఉదాహరణలతో వివరించారు. నెమ్మదిగా నేర్చుకునే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి, నాణ్యతతో కూడిన ఆహారం అందించాలని పేర్కొన్నారు.
-
వర్షపు నీటి గుంతలో పడి బాలుడు మృతి
నారాయణపేట: మద్దూరు మండలకేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి పక్కనే ఉన్న నిర్మాణ గుంతలో నిలిచిపోయిన వర్షపునీటిలో పడి ఐదేళ్ల భరత్‌కుమార్ మృతిచెందాడు. పోలీసుల వివరాలప్రకారం.. కోస్గి మండలం ముంగిమల్ల గ్రామానికి చెందిన మొగులయ్య, అనంత దంపతులు మద్దూరులో ఫెర్టిలైజర్ షాపు నిర్వహిస్తున్నారు. ఇంటి దగ్గర ఆడుకుంటున్న భరత్ గుంతలో పడటంతో మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదుచేసి పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
-
వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు
నాగర్ కర్నూల్: జిల్లా కేంద్రంలో వినాయక చవితి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. రెండో వార్డు బొడ్రాయి దగ్గర ఏర్పాటు చేసిన భీమ్ సేన అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ గణనాథుడి విగ్రహం చూపరులను ఆకట్టుకుంది. మండపం వద్ద గణపయ్యకు యువకులు పూజలు చేశారు. అనంతరం కాలనీ వసూలు ప్రసాదాలు అందజేశారు.
-
పొంగుతున్న కృష్ణా.. శ్రీశైలానికి భారీగా నీరు
మహబూబ్‌నగర్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. బుధవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 3.31 లక్షల క్యూసెక్కులు, 3.63 లక్షల క్యూసెక్కులు ఔట్ ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు, విద్యుత్ ఉత్పత్తికి నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
-
ప్రభుత్వాసుపత్రిలో చవితి వేడుకలు
నాగర్‌కర్నూల్: ప్రభుత్వ ఆసుపత్రిలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మెడికల్ సూపరింటెండెంట్ డా. టి. ఉషారాణి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాలు పడకుండా కాపాడాలని గణపతిని వేడుకున్నారు. ఈ వేడుకల్లో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
-
కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది: శివశంకర్
నాగర్ కర్నూల్: తెలకపల్లిలో యూరియా కోసం రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డపాకుల శివశంకర్ అన్నారు. స్థానిక PACS వద్ద రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 4 రోజుల నుంచి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నా సకాలంలో అందడంలేదన్నారు. యూరియా కొరతను తీర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇప్పటికైనా యూరియా కొరతను తీర్చాలని డిమాండ్ చేశారు.