Locations: నాగర్ కర్నూల్

  • అగ్నివీర్‌లో దరఖాస్తుల ఆహ్వానం

    నాగర్ కర్నూల్: జిల్లాలోని యువత భారత వైమానిక దళం అగ్నివీర్‌లో చేరేందుకు ఆసక్తి గలిగిన వారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారి రాఘవేంద్రసింగ్ తెలిపారు. పదో తరగతి పాసై ఉండి 18 నుంచి 30 ఏళ్ల లోపు వయస్సు కలిగిన వారు అర్హులని http//agnipathvayu.cdac.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 78391 26339, 63002 95801 నంబర్లను సంప్రదించాలని కోరారు.

  • మూడేళ్ల కూతురిని చంపిన తల్లి..

    మహబూబ్‌నగర్: జిల్లా కలెక్టరేట్ సమీపంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. యశోద అనే తల్లి తన మూడేళ్ల కూతురును ఊపిరాడకుండా చేసి చంపిన తర్వాత తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రేబిస్ వ్యాధితో ఆమె మతిస్థిమితం కోల్పోయి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  • ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

    నాగర్‌కర్నూల్: అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

     

  • పింఛన్ల పంపిణీకి కొత్త పద్ధతి

    నాగర్‌కర్నూల్: జిల్లాలో చేయూత పింఛన్ల పంపిణీకి కొత్త పద్ధతిని అమలు చేస్తున్నారు. అక్రమాలను అరికట్టడానికి, వేలిముద్రలకు బదులుగా ముఖ గుర్తింపు ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌తో కూడిన మొబైల్ ఫోన్‌లను పోస్ట్ ఆఫీస్ సిబ్బందికి అందజేశారు. ఈ విధానం వల్ల పింఛనుదారులు మరింత సులభంగా పింఛన్లు పొందవచ్చని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు.

  • ‘ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలి’

    నాగర్‌కర్నూల్: జిల్లాలో ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన 39 దరఖాస్తులను స్వీకరించారు. అధికారులు సానుకూలంగా స్పందించి, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు.

  • మట్టి గణపతులను పూజించాలి: కలెక్టర్

    నాగర్‌కర్నూల్: పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను పూజించాలని ప్రజలకు కలెక్టర్ బాదావత్ సంతోష్ పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీటి కాలుష్యం, జీవవైవిధ్యానికి ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించేందుకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.

  • ‘RTI నిర్వీర్యం అవుతుంది’

    నాగర్‌కర్నూల్: జిల్లాలో సమాచార హక్కు చట్టం నిర్వీర్యం అవుతుందని బీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంగరి రామకృష్ణ అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ చట్టం బోర్డులు కూడా లేవని, చట్టాన్ని అమలు చేయడంలో అలసత్వం కనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ విషయంపై ఆయన అదనపు కలెక్టర్ దేవసహాయంకు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించి, చట్టం కఠినంగా అమలయ్యేలా చూడాలని కోరారు.

  • ‘వికలాంగుల పెన్షన్‌ పెంచాలి’

    నాగర్‌కర్నూల్: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వికలాంగుల, వృద్ధులు, వితంతువుల, చేయూత, పెన్షనర్ల సన్నాహక సదస్సులో పాల్గొన్నారు. వికలాంగుల పెన్షన్‌ను రూ.6,000కు, వృద్ధులు, వితంతువుల పెన్షన్‌ను రూ.4,000కు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉర్కొండ మండల ఇన్‌ఛార్జ్ రాధాకృష్ణ మాదిగ, దుబ్బ నాగేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

  • ‘కాలేజీ సమస్యలు పరిష్కరించాలి’

    నాగర్‌కర్నూల్: పెద్దకొత్తపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చింది. కాలేజీ భవనం, తాగునీరు, వాష్‌రూమ్‌లు, ల్యాబ్‌లు, నాన్ టీచింగ్ సిబ్బంది లేరని, తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ రమేష్ హెచ్చరించారు.

  • ‘విద్యారంగ సమస్యలను విస్మరించారు’

    నాగర్‌కర్నూల్‌: ఏబీవీపీ విద్యారంగ సమస్యలపై సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించింది. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగారు బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలు ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి విద్యారంగ సమస్యలను విస్మరించారని మండిపడ్డారు.